విధాత : శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా ప్రముక సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ లో బాల కృష్ణుడి అద్బుత ఇసుక శిల్పాన్ని సృష్టించి సందర్శకులకు కనువిందు చేశారు.
పూరీ సముద్ర తీరంలో 101 మట్టి వెన్న కుండలతో శ్రీకృష్ణుడి సౌకత శిల్పం తీర్చిదిద్దారు. వెన్న దొంగతనం ఘట్టంతో కృష్ణుడి బాల్య లీలలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ కన్నయ్య శిల్పం భక్తులను ఆకట్టుకుంటుంది. వెన్న దొంగ బాలకృష్ణుడి సైకత శిల్పాన్ని దర్శించుకునేందుకు భక్తులు పూరీ బీచ్ కు పోటెత్తారు. వెన్నకుండతో ఉన్న బాలకృష్ణుడి చెంతనే గోవు, మురళీ, నెమలి పింఛాలను కూడా పట్నాయక్ తీర్చిదిద్దిన తీరుతో ద్వాపర యుగం నాటి బృందావనం కళ్లముందు ఆవిష్కృతమైనట్లుగా ఉందని భక్తులు ప్రశంసిస్తున్నారు.
శ్రీకృష్ణుడు బాల్యంలో చేసిన చిలిపి చేష్టలను, దివ్య లీలలను శ్రీమద్భాగవతం అద్భుతంగా వర్ణించింది. ఆబాలగోపాలానికీ ప్రేమపాత్రుడైన నవనీత చోరుడైన బాలకృష్ణుడి అపురూపమైన సైకిత శిల్పాన్ని చెక్కిన శిల్పి సుదర్శన్ పట్నాయక్ ను భక్తులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ సైకత శిల్పం ద్వారా అందరికీ శాంతి, సంతోషం, శ్రేయస్సు కలగాలని శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఆకాంక్షించారు.
जन्माष्टमी पर पुरी बीच पर सुदर्शन पटनायक ने 101 माखन हांडियों से भगवान कृष्ण की शानदार सैंड आर्ट बनाई।#SudarsanPattnaik #PuriBeach #Janmashtami #Krishna #KrishnaJanmashtami #SandArt #Odisha #Puri #Janmashtami2026 #LordKrishna #upnews9 pic.twitter.com/uzBpdeztwk
— upnews 9 (@UpnewsI65659) September 4, 2026