ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో ఓ మానవ మృగం చేతిలో ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. షాబాద్‌ మండల కేంద్రంలోని దైవాలగూడలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్‌కుమార్‌ (28) అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేశాడు.

విధాత, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఓ మానవ మృగం చేతిలో ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. షాబాద్‌ మండల కేంద్రంలోని దైవాలగూడలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్‌కుమార్‌ (28) అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేశాడు.

బాలికను వేధించాడని బాధితురాలు, తల్లి మే 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసులో రాజ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. బెయిల్‌పై తిరిగొచ్చిన నిందితుడు.. శనివారం తెల్లవారుజామున ఆరుగురిని నిందితుడు కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి..తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా నిందితుడు చెప్పాడు. వెంటనే అతని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.

నిందితుడి చేతిలో బాధిత బాలిక, బాలిక తల్లి, నానమ్మ, నిందితుడి భార్య సరిత, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు హత్యకు గురైనట్లు తెలిపారు. బాధిత మైనర్ బాలిక(17)ను నిందితుడు ఊరి శివారల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాజ్‌కుమార్‌ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

ఏడాది క్రితం బాలిక తండ్రిని కూడా రాజ్ కుమార్ హత్య చేసినట్లుగా పోలీసులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. గతంలో బాలిక ను వేధించే క్రమంలో ఆమె తల్లిని బెదిరిస్తూ.. నీ భర్తను చంపినట్లుగానే మిమ్మల్ని అందరిని చంపేస్తానంటూ నిందితుడు బెదిరించాడని, ఈ విషయాన్ని పోలీసు ఫిర్యాదులో కూడా పేర్కొన్నామని బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Latest News