BRS MLA suspension| మంత్రి పొంగులేటి అవినీతిపై ప్రశ్నించినందుకే మా సస్పెన్షన్ : బీఆర్ఎస్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ అవినీతిపై ప్రశ్నించినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ ద్వారా మమ్మల్ని శాసన సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మంత్రి అవినీతిని ప్రశ్నించి ఆయన బర్తరఫ్ కు డిమాండ్ చేసినందుకే.. సస్పెండ్ చేస్తారా అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ అనంతరం సభ నుంచి బయటకు వస్తూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.

విధాత, హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ అవినీతిపై ప్రశ్నించినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ ద్వారా మమ్మల్ని శాసన సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మంత్రి అవినీతిని ప్రశ్నించి ఆయన బర్తరఫ్ కు డిమాండ్ చేసినందుకే.. సస్పెండ్ చేస్తారా అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ అనంతరం సభ నుంచి బయటకు వస్తూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. సస్పెండైన హరీశ్ రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్ సహా ఎమ్మెల్యేలు నిరసనలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ చేస్తూ, ప్రభుత్వ సంపదను అడ్డంగా మేస్తున్న కాంగ్రెస్ మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని తెలిపారు. శాసన సభ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై మాపోరాటం ఆగబోదన్నారు. ప్రజాక్షేత్రంలో మా పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ స్వాధీనం వెనుక కూడా పెద్ద భూ దందా స్కెచ్‌గా కనిపిస్తోందని, 280 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడమే అసలు లక్ష్యమని ఆరోపించారు. ఇందులో ప్రజల ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. ఈ అంశంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన 20స్కామ్ లపై విచారణ జరుపాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లుగా తెలిపారు.

Latest News