Telangana BC Reservations Case| ఆక్టోబర్ 8కి బీసీ రిజర్వేషన్ల విచారణ వాయిదా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణను హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఆక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో(Telangana Local Body Elections) 42శాతం బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణను హైకోర్టు(Telangana High Court) ప్రత్యేక ధర్మాసనం ఆక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం నిర్ణయాన్ని సోమవారం వెల్లడిస్తానని ఏజీ సుదర్శన్ రెడ్డి చెప్పడంతో కేసు విచారణను వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతల మండలం కేశవాపూర్ కు చెందిన రెడ్డి జాగృతి అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త బుట్టెంగారి మాధవరెడ్డి ప్రభుత్వం జారీ చేసిన బీసీ రిజర్వేషన్ల పిటిషన్ దాఖలు చేస్తూ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఏర్పాటు చేశారు. జస్టిస్ విజయ్ సేన్, జస్టిస్ అభినందన్ కుమార్ షావలిలతో కూడిన బెంచ్ ను ప్రకటించారు. ఈ బెంచ్ ఈ రోజు శనివారం సాయంత్రం బీసీ రిజర్వేషన్ల పిటిషన్ ను విచారించింది. మొత్తం రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి 50శాతం దాటకుండా ఆదేశించాలంటూ తన పిటిషన్ లో కోరారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో రిజర్వేషన్లు 50శాతం మించకుండా పరిమితి విధించారని..దాన్ని కొనసాగించేలా ఆదేశించాలని కోర్టును కోరారు.
కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్న సమయంలో జీవో జారీ చేయడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకోవచ్చని సూచించింది. కోర్టుల జోక్యం లేకుండా ఉండాలంటే ప్రభుత్వం 10 రోజులు ఎన్నికలు వాయిదా వేసుకోవచ్చు” అని హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయం ఏమిటో స్పష్టంగా తెలియజేయాలని కూడా ఆదేశించింది. ఈ దశలో ఏజీ ఎన్నికల వాయిదా వేసే అంశంపై ప్రభుత్వంతో సంప్రదించి సోమవారం ప్రభుత్వ అభిప్రాయం చెబుతానని చెప్పడంతో కేసు వాయిదా వేసింది. నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించొచ్చు కదా అని కూడా హైకోర్టు సూచించింది. ఇప్పటికిప్పుడు జీవో 9లో తాము జోక్యం చేసుకోబోమంది. రిజర్వేషన్ల కోసం చాలా కసరత్తు చేసి ఇంత హడావిడిగా…జీవో తీసుకురావడం ఏంటని ప్రశ్నించింది. ఎన్నికలకు టైం కావాలంటే నెల రోజులు అడగొచ్చు కదా అని వ్యాఖ్యానించింది.రాజ్యాంగం ప్రకారం.. రిజర్వేషన్లు 50 శాతం మించవద్దనే నిబంధన ఉంది కదా..? అని అడ్వకేట్ జనరల్‌ను కోర్టు ప్రశ్నించింది. దసరా సెలవుల తర్వాత వాదనలు వినాలని అడ్వకేట్ జనరల్ కోరగా..ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేస్తేనే వాదనలు వింటామన్న జడ్జి తెలిపారు.
పిటిషన్ల తరఫున సీనియర్ లాయర్లు ప్రభాకర్, మయూర్ రెడ్డిలు వాదనలు వినిపించారు. జీవో గెజిట్ కానప్పుడు ఎందుకు ఆందోళన చెందుతున్నారని కోర్టు ప్రశ్నించింది. జీవో గెజిట్ అవునా కాదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని ఇరుపక్షాలను కోరింది. బిల్లుకు పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయి కదా…అని పిటిషనర్‌ని ప్రశ్నించింది. బిల్లును ఎవరూ వ్యతిరేకించలేదు కదా అని న్యాయమూర్తులు గుర్తు చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టే మేం పిటిషన్ వేశామని పిటిషనర్ వాదించారు. లేదు ఇది అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయమన్న అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. మా పిటిషన్ ఏ సామాజికవర్గానికి వ్యతిరేకమో కాదని పిటిషనర్ స్పష్టం చేశారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. తమిళనాడులో 50శాతానికి మించి పెంచారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారని పిటిషన్ తరుపు న్యాయవాది తెలిపారు. తుది తీర్పు ఏం వచ్చిందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్‌కు ఎప్పుడు వెళ్లిందని…పిటిషనర్‌ని ప్రశ్నించింది. ప్రభుత్వం పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించారా అని ప్రశ్నించింది. ఇటీవల గవర్నర్‌కు దగ్గర బిల్లుల పెండింగ్ అంశంలో… సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏజీ ప్రస్తావించారు. గవర్నర్‌కు బిల్లు పంపి నెల దాటిందన్న ఏజీ తెలిపారు. గవర్నర్ బిల్లును ఆమోదించకుండా కొత్తగా మళ్లీ జీవో ఎందుకు తెచ్చారని ప్రశ్నించింది.