Kaleshwaram Project| కాళేశ్వరంపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం లేఖ అందింది: సీబీఐ

Kaleshwaram Project| కాళేశ్వరంపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం లేఖ అందింది: సీబీఐ

న్యూఢిల్లీ: కాళేశ్వరం నిర్మాణ అవకతవకలపై విచారణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ సీబీఐకి చేరింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ తమకు అందినట్లుగా సీబీఐ ఎకనాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అక్రమాలు, అవినీతి జరిగినట్లుగా బహిర్గతమైందని..దీనిపై సీబీఐ పూర్తి స్థాయి దర్యాప్తు జరుపాలని..ఇందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందంటూ లేఖలో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కాళేశ్వరం నిర్మాణ అక్రమాలపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్, జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణలోనూ అక్రమాలు వెల్లడయ్యాయని ప్రభుత్వం తన లేఖలో గుర్తు చేసింది.

లేఖను అటు కేంద్ర హోంశాఖకు, ఇటు సీబీఐకి అందించింది. ప్రాజెక్టు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లనే నిర్మాణ వైఫల్యం చోటుచేసుకుందని ఎన్డీఎస్ఏ నివేదిక వెల్లడించిందని ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది. కాళేశ్వరం నిర్మాణ వైఫల్యంతో రాష్ట్ర ఖజనాకు భారీ నష్టం జరిగిందని లేఖలో వెల్లడించింది. ప్రాజెక్టు నిర్మాణంలోని అధికారులు, కాంట్రాక్టులు, ప్రవైట్ కంపనీలపైన, ప్రజాప్రతినిధులపైన సీబీఐ దర్యాప్తు చేయాలని లేఖలో సీబీఐని కోరింది. సీబీఐకి కేసు బదిలీచేస్తూ జీవో 104ను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. మేడిగడ్డ బరాజ్ కూలినప్పుడు మహాదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ చట్టం 1946 కింద సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతిస్తున్నట్లుగా పేర్కొంది.

అయితే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్ధన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాలకు..సీబీఐ విచారణ కోరుతూ ప్రభుత్వం రాసిన లేఖకు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.