Telangana liquor applications| మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు పెంపు.!

: మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ గడువును తెలంగాణ ప్రభుత్వం ఆక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Oct 19, 2025, 1:04 pm IST
Read Time: 3 mins
Telangana liquor applications| మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు పెంపు.!

విధాత, హైదరాబాద్ : మద్యం దుకాణాల దరఖాస్తుల(liquor Shops applications) స్వీకరణ గడువును తెలంగాణ ప్రభుత్వం ఆక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించింది(Extended). ఈ మేరకు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. 23న తేదీన జరగాల్సిన మద్యం షాపుల డ్రాను సైతం 27కు వాయిదా వేశారు. ముందుగా నిర్ణయించిన దరఖాస్తుల షెడ్యూల్ ప్రకారం శనివారం దరఖాస్తులకు చివరి రోజు. అయితే ఆ రోజు బీసీ బంద్ కారణంగా కొన్ని బ్యాంకులు తెరుచుకోలేదు. దీంతో మద్యం దరఖాస్తులపై బంద్ ప్రభావం చూపిందని భావించిన ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల గడువు పెంపుకు నిర్ణయం తీసుకుంది.

87వేలకు పైగా దరఖాస్తులు

శనివారం సాయంత్రం 5 గంటలకు ఆబ్కారీ కార్యాలయాలకు వచ్చిన వ్యాపారులకు టోకెన్లు ఇచ్చి మరీ రాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రంలోని 2,620 వైన్స్ లకు ఇప్పటిదాక 87వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. దరఖాస్తు ఫీజు నాన్ రీఫండబుల్ గా రూ.3లక్షలుగా నిర్ణయించినప్పటికి భారీగా దరఖాస్తులు రావడం గమనార్హం. దీంతో ప్రభుత్వానికి దరఖాస్తుల రూపంలో భారీగానే ఆదాయం దక్కబోతుంది. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి 2027 నవంబరు 30 వరకు(రెండేళ్లపాటు) ఈ లైసెన్స్ విధానం అమల్లో ఉంటుంది.