Wife Kills Husband| కూల్ డ్రింకులో గడ్డి మందు కలిపి భర్తను చంపిన భార్య

Wife Kills Husband| కూల్ డ్రింకులో గడ్డి మందు కలిపి భర్తను చంపిన భార్య

భర్త మృతికి సంబంధం లేదంటున్న కాంతి

విధాత, వరంగల్ ప్రతినిధి: వర్ధన్నపేట పట్టణం భవాని కుంట తండా కి చెందిన జాటోతు బాలాజీ(40) ఈ నెల 8 తారీఖున దాటుడు పండుగ రోజు భార్య కాంతికి చికెన్ తెచ్చి వండమని తాను మద్యం సేవించి వస్తానని వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాక బాలాజీకి పథకం ప్రకారం ఇంట్లో ఉన్న గడ్డి మందును కూల్ డ్రింకులో కలిపి ఇవ్వగా తాగిన బాలాజీకి కొద్దిసేపటి తర్వాత గొంతు మండుతుందని అరుస్తుండగా మృతి చెందలేదని గమనించిన భార్య కాంతి(38) తన బావ అయిన వాంకుడోతు దస్రు (40) ఇంటికి వెళ్లి ఏం తెలియనట్లు ఉంది.బాలాజిని గమనించిన కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందడంతో తండ్రి జాటోతు హరిచందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎస్.ఐ చందర్ తెలిపారు.

ఆయనే గడ్డిమందు తాగాడు: భార్య

గత 30 సంవత్సరాలుగా తన భర్త తనను వివిధ రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని మృతుని భార్య కాంతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ బాధ భరించలేక తాను గడ్డి మందు కలుపుకొని ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధం కాగా తన భర్త దాన్ని లాక్కొని ఆయనే తాగాడని వివరించింది. దీంతో భయపడిపోయిన తాను ఇంట్లో నుంచి పరిగెత్తి తన బావ ఇంటికి వెళ్లానని వివరించింది. తన భర్త మృతిలో తనకు ఏమి సంబంధం లేదని స్పష్టం చేసింది.