ఏనుగుల గుంపు నిర్వాకం..కొబ్బరి చెట్టు చోరీ!

కర్ణాటక –తమిళనాడు సరిహద్దులోని నిత్లాపూరా గ్రామంలోకి ఓ అడవి ఏనుగుల గుంపు రాత్రి వేళ ప్రవేశించి గ్రామస్తులను భయపెట్టింది. పంటలు, ఆస్తులకు నష్టం కల్గించాయి. కొబ్బరి తోటలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు ఓ కొబ్బరి చెట్టును వేళ్లతో సహా పెకిలించి వెంట తీసుకెళ్లడం వైరల్ గా మారింది.

విధాత : అడవి నుంచి సమీప గ్రామంలో ప్రవేశించిన అడవి ఏనుగుల గుంపు విధ్వంసం సృష్టించాయి. కర్ణాటక –తమిళనాడు సరిహద్దులోని నిత్లాపూరా గ్రామంలోకి ఓ అడవి ఏనుగుల గుంపు రాత్రి వేళ ప్రవేశించి గ్రామస్తులను భయపెట్టింది. పంటలు, ఆస్తులకు నష్టం కల్గించాయి. ఓ కొబ్బరి తోటలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు తోటలో చెట్లను నాశనం చేసి స్వాహా చేశాయి. ఓ కొబ్బరి చెట్టును వేళ్లతో సహా పెకిలించి వెంట తీసుకెళ్లడం విడ్డూరం. ఈ ఘటన అక్కడి ఓ భవనంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీలో రికార్డైంది. అది కాస్తా వైరల్ గా మారింది.

ఏనుగుల సంచారంతో పంటలు, ఆస్తులకు నష్టం జరుగుతుందనే ఆందోళనతో అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఏనుగుల గుంపు మళ్లీ గ్రామంలోకి ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు.

 

Latest News