Winchester Mystery House | ఆత్మల కోసం నిర్మించిన భారీ భవంతి.. ఎక్కడుందో తెలుసా?
తమ రాజసాన్ని చూపించుకోవడం కోసం చరిత్రలో చాలామంది భారీ కట్టడాలను నిర్మించారు. కొందరు వారికి ఇష్టమైన నిర్మాణాలను కట్టిస్తే మరికొందరు వారి విజయాలకు గుర్తులుగా.. తమ ప్రేమకు ప్రతిరూపాలుగా కొన్ని ప్రత్యేకమైన కట్టడాలను కట్టించారు. కానీ, అమెరికాలో ఉన్న ఓ మిస్టరీ భవనాన్ని మాత్రం ఆత్మల కోసం కట్టించారనే ప్రచారం వందల ఏండ్లుగా కొనసాగుతోంది.
Winchester Mystery House | తమ రాజసాన్ని చూపించుకోవడం కోసం చరిత్రలో చాలామంది భారీ కట్టడాలను నిర్మించారు. కొందరు వారికి ఇష్టమైన నిర్మాణాలను కట్టిస్తే మరికొందరు వారి విజయాలకు గుర్తులుగా.. తమ ప్రేమకు ప్రతిరూపాలుగా కొన్ని ప్రత్యేకమైన కట్టడాలను కట్టించారు. కానీ, అమెరికాలో ఉన్న ఓ మిస్టరీ భవనాన్ని మాత్రం ఆత్మల కోసం కట్టించారనే ప్రచారం వందల ఏండ్లుగా కొనసాగుతోంది. ఆ భవనమే సాన్‌జోస్ నగరంలో ఉన్న విన్చెస్టర్ మిస్టరీ హౌస్. ఇది భవనం మాత్రమే కాదు.. ఒక రహస్యమైన నిర్మాణం. ఎందుంటే 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవంతిలో ప్రతిదీ వింతగా ఉంటుంది. అందులో దారిలేని మెట్లు, గాలిలోకి తెరుచుకునే తలుపులు, నేలపై అమర్చిన స్కైలైట్లు వీటితో ఈ బిల్డింగ్ కు ‘మిస్టరీ హౌస్’ అనే పేరు వచ్చింది.
అసలెంటీ ఈ భవంతి చరిత్ర..
ప్రసిద్ధ విన్చెస్టర్ రైఫిల్ కంపెనీ యజమాని అయిన విలియమ్ విన్చెస్టర్ భార్య అయిన సారా విన్చెస్టర్ ఈ మిస్టరీ హౌస్ ను నిర్మించింది. దీనికి కారణం విన్చెస్టర్ తుపాకీల వల్ల చనిపోయిన ఆత్మలు తనను వెంటాడుతున్నాయని, ఈ భయంతో ఎప్పటికీ పూర్తి కానీ భవనాన్ని కడితే ఆత్మలు తనను పీడించలేవని ఓ ఆధ్యాత్మిక గురువు తనకు చెప్పారంటా. దీంతో సారా 1884లో ప్రారంభించిన ఈ భవన నిర్మాణం 38 ఏళ్ల పాటు ఆగలేదు. రాత్రింబవళ్లూ కడుతున్నా ఈ భవంతి కట్టడం పూర్తి కాలేదు. చివరకు సారా మరణించడంతో ఈ నిర్మాణం ఆగిపోయింది. కాగా, ఈ ఇంట్లో 160 గదులు 160 గదులు, 2,000 తలుపులు, 47 మెట్లు, 10,000 కిటికీలు, 52 స్కైలైట్లు ఉన్నాయి. ఇందులో గోడలకు తలుపులు, ఎక్కడికివెళ్లాలో తెలియని మెట్లు నిర్మించారు. కాగా, 1906లో సాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చిన భూకంపంలో ఈ భవనం దెబ్బతిన్నది. దీంతో సారా అప్పటి నుంచి ఈ బిల్డింగ్ ను మూసివేసింది.
మిస్టరీ హౌస్‌లో ఆత్మల సంచారం?
ఇప్పటికీ ఆ గది చుట్టూ వింత శబ్దాలు వినిపిస్తాయని పర్యాటకులు చెబుతుంటారు. కొన్నిసార్లు తలుపులు వాటంతట అవే తెరుచుకోవడం, వింత శబ్ధాలు వినిపించడం, నీడ ఆకారంలో రూపాలు కనిపించాయని టూరిస్టులు చెబుతున్నారు. అయితే, సారానే ఆత్మగా మారి భవనంలో తిరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ భవనాన్ని కొందరు ఆర్కిటెక్చర్ అద్భుతంగా కొనియాడితే.. ఆత్మల భయం వల్లే సారా విన్చెస్టర్ కట్టడాన్ని నిర్మించారని మరికొందరు నమ్ముతున్నారు. ఏది ఏమైనా ఈ మిస్టీరీ హౌస్ (Winchester Mystery House) మాత్రం పర్యాటకులను రోజురోజుకు ఆకర్షిస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram