Deathbots | ఏఐ ఉపయోగించి ఆత్మలతో మాట్లాడవచ్చునా?
ఆత్మలతో మాట్లాడవచ్చునా? చనిపోయినవారిని సలహాలు అడగవచ్చా? సాధ్యమేనంటున్నది ఏఐ. కాకపోతే అదీ కృత్రిమమే!
Deathbots | మీరు కొన్ని రీల్స్ చూసి ఉంటారు.. అందులో పాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోలోని వ్యక్తులు పరస్పరం చూసుకుంటూ నవ్వుతున్నట్టో.. లేదా.. చేతులు కలుపుకొంటున్నట్టో కనిపిస్తుంది కదా! ఇది ఏఐ సాంకేతికత అని ప్రత్యేకంగా చెప్పనవసరం కూడా లేదు. దీనికోసం ప్రత్యేకంగా యాప్స్ వస్తున్నయి. ఎక్కువభాగం నిర్దిష్ట ఫీజులతో ఉంటున్నాయి. నిజానికి ఇప్పుడు ఇదొక పెద్ద వ్యాపారంగా తయారైంది. ఇదే క్రమంలో మరణించినవారితో మాట్లాడే, వారి గొంతు వినే అవకాశం కూడా కల్పిస్తున్నాయి కొన్ని చాట్‌బాట్‌లు. మరణించిన మన ఆత్మీయులే మనతో మాట్లాడుతున్నారా? అనిపించేంత కచ్చితత్వంతో వస్తున్న సాంకేతికత మరణించిన మనుషుల జ్ఞాపకాలను ఇంటరాక్టివ్‌గా, కొన్నిసార్లు శాశ్వతంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇటీవల మెమోరీ, మైండ్ అండ్ మీడియా (Memory, Mind & Media) జర్నల్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైంది. డెత్‌బాట్స్ (Deathbots) అని పిలుస్తున్న కొత్త ఏఐ సాంకేతికతలను శాస్త్రవేత్తలు ఇందులో అధ్యయనం చేశారు. ఇవి మరణించిన వ్యక్తులు మాట్లాడే శైలి, వారి గొంతు, వారి వ్యక్తిత్వాలను అల్గోరిథంల ద్వారా పునఃసృష్టించాయి. గతంలో వారి సందేశాలు, సోషల్ మీడియా పోస్టులు, ఈమెయిల్స్, ఆడియో రికార్డింగ్స్‌కు సంబంధించిన డాటా సేకరించి.. ‘బతికి ఉండి మాట్లాడుతున్నట్టుగా అవతార్‌లను రూపొందిస్తాయి. ఇదొక మాయా సాంకేతికత అని శాస్త్రవేత్త సిమోన్ నతాలే అభివర్ణించారు. ఆత్మల విషయంలో ప్రాచీన సూత్రాలను ఇప్పుడు ఏఐ కొత్త రూపంలో తీసుకువస్తున్నదని వ్యాఖ్యానించారు.
Artificial Intelligence | ఏఐని మితిమీరి వాడుతున్నారా? అయితే భవిష్యత్తులో మీ పరిస్థితి అథోగతే!
తాజా అధ్యయనం నిర్వహించిన బృందం.. Synthetic Pasts ప్రాజెక్ట్ కింద పని చేసింది.తమ సొంత వీడియోలు, వాయిస్ నోట్స్, మెసేజెస్ అప్‌లోడ్ చేసి.. వాటికి డిజిటల్ డబుల్స్ (digital doubles) సృష్టించారు. కొన్ని సార్లు వారే మరణించినట్టుగా భావించి, కొన్నిసార్లు ఆప్తులను కోల్పోవారిగా నటించి.. ఆ అవతార్‌లతో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేశారు. కొన్ని సిస్టమ్స్.. యూజర్స్ తమ వ్యక్తిగత జీవితానుభవాలను, జ్ఞాపకాలను, బాల్యం నాటి సంగతులను, కుటుంబ సభ్యుల వివరాలు, కొన్ని రకాల సలహాలు అప్‌లోడ్ చేయడం ద్వారా ఏఐ ఆ కథలను ఒక ‘జ్ఞాపకాల కుప్ప’గా రూపొందించాయి.
కొన్ని ప్లాట్‌ఫారమ్స్.. జెనరేటివ్ ఏఐని ఉపయోగించి.. చనిపోయిన వ్యక్తులతో నిరంతరం సంభాషణ కొనసాగించే అనుభవాన్ని ఇచ్చాయి. ఇందుకోసం మరణించినవారి పాత వాయిస్ క్లిప్పింగ్స్, టెక్ట్స్, పోస్టుల ఆధారంగా ఒక బాట్ సృష్టించారు. అది సదరు వ్యక్తి జీవించి ఉన్నట్టుగానే ప్రవర్తిస్తూ.. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. కానీ.. ఒక ప్రశ్నను ఎన్ని విధాలుగా అడిగినా.. ఒకే తరహాలో సమాధానాలు వచ్చాయి. ఎంత చేసినా.. అది కృత్రిమం మాత్రమే కదా! మానవ భావోద్వేగాలను అల్గోరిథమ్‌లు అర్థం చేసుకోలేవని, కేవలం అడిగిన ప్రశ్నకు మాత్రం తన ఆర్కైవ్‌లో ఉన్న సమాచారం మేరకు సమాధానాలు ఇచ్చింది. కొన్ని ప్లాట్‌ఫామ్స్ ‘ఏఐ సహాయంతో ఆత్మలను పిలుచుకోవచ్చు’ అంటూ సరదాగా చెబుతున్నా.. తక్షణ అనుభవం మాత్రం నిజమేనా? అనిపించేలా ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఒక పరిశోధకుడు.. ‘నీ ప్రోత్సాహం చాలా మిస్ అవుతున్నాను..’ అని చాట్‌బాట్‌కు చెబితే.. ‘ఎందుకలా.. నేనిక్కడే ఉన్నానుగా.. నీకు ఎల్లవేళలా నా మద్దతు ఉంటుంది’ అని చాట్‌బాట్ బదులు చెబుతుంది. అప్పటికి ఆ క్షణం హృదయాన్ని తాకినట్టు ఉన్నా.. మరుక్షణమే శూన్యత ఆవహిస్తుంది. ఎందుకంటే.. అది నిజమైన మనిషి కాదు.. మనిషి రాసిన కోడ్‌ల సమాహారం మాత్రమే.
AI Deepfake Videos Threat | సినీ సెలెబ్రిటీలను, రాజకీయ నాయకులను షేక్ చేస్తున్న ఏఐ!
వెరసి.. జ్ఞాపకాలు కూడా వ్యాపార ఉత్పత్తులుగా మారిపోతున్నాయన్నమాట. మరణం తర్వాత కూడా వ్యక్తికి సంబంధించిన డాటా ఆర్థిక విలువను సృష్టించే పొలిటికల్ ఎకానమీ ఆఫ్ డెత్‌లో భాగంగా వీటిని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. భావోద్వేగాలను డాటాగా మార్చే కొత్త వ్యాపార నమూనా.. ఎమోషనల్ ఏఐ ఎకానమీగా ప్రొఫెసర్ ఆండ్రూ మెక్‌స్టే దీనిని అభివర్ణించారు. ఈ వ్యవస్థలు ఒక రకంగా ‘పునర్జన్మ’ను అందిస్తామని చెబుతాయి. అది.. తగిన డాటాను ఉపయోగించుకుని, మరణించినవారు మళ్లీ జీవించేలా చేయడం. అంటే.. వారి గొంతు, మాట తీరు, వ్యక్తిత్వాలను అన్నింటినీ సిమ్యూలేట్ చేయడం. ఇది నిజమైన జీవన సంబంధం కాదు.. సాఫ్ట్‌వేర్ విప్లవం సృష్టిస్తున్న మనవతా ప్రతిరూపం!
AI Chatbots Study | చాట్‌బాట్‌లు సమాధానాలిచ్చే తీరుపై శాస్త్రవేత్తల ప్రయోగం.. విస్తుపోయే వాస్తవాలు వెల్లడి!
AI Chatbot | AI చాట్‌బాట్‌తో భర్త వివాహేతర సంబంధం.. భార్య ఏమందంటే
Artificial Intelligence | వామ్మో.. కృత్రిమ మేధతో ఇన్ని డేంజర్లా? నశించనున్న మానవ మేధ!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram