YS Jagan| దిగజారిపోతున్న ఏపీ ఆర్థిక పరిస్థితి: వైఎస్ జగన్ ఆందోళన

ఏపీ ఆర్ధిక పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన కూటమి నేతలు చెప్పిన దానికి విరుద్దంగా ఆర్థిక పరిస్థితి ఉందని జగన్‌ పేర్కొన్నారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్‌ జగన్‌​ ఏపీ ఆర్థిక పరిస్థితుల వివరాలను ఎక్స్‌లో పోస్టు చేశారు.

YS Jagan| దిగజారిపోతున్న ఏపీ ఆర్థిక పరిస్థితి: వైఎస్ జగన్ ఆందోళన

విధాత: ఏపీ ఆర్ధిక(AP Economy) పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన కూటమి నేతలు చెప్పిన దానికి విరుద్దంగా ఆర్థిక పరిస్థితి ఉందని జగన్‌ పేర్కొన్నారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్‌ జగన్‌​ ఏపీ ఆర్థిక పరిస్థితుల వివరాలను ఎక్స్‌లో పోస్టు చేశారు. తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగి పోతున్న రుణభారంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరకరంగా మారిందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనపడతాయని, 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7.03% మాత్రమే ఉందని, 2025-26లోనైనా రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుందని చాలామంది ఆశించారని తెలిపారు.

కాగ్ విడుదల చేసిన గణాంకాలు చూస్తే సొంత ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా, మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయని.. అయినప్పటికీ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందంటూ ఎలా ప్రచారం చేస్తారు? అని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీ వృద్ధిని 12.02%గా ప్రభుత్వం ప్రకటించిందని, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ వృద్ధిని 17.1%గా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఫలితాలు దారుణంగా ఉన్నట్లు కాగ్ నివేదికలే తేల్చి చెప్తున్నాయన్నారు. అంటూ జగన్ పేర్కొన్నారు.కూటమి నేతలు చెబుతున్నట్లుగా సంపద సృష్టి లేకపోగా.. రాష్ట్రం తిరోగమనంలో ఉందన్నారు. కానీ కూటమి పాలకులు మాత్రం వృద్దిలో వేగంగా పరుగులెత్తుతోందంటూ ఎలా మాట్లాడతున్నారు? అని జగన్ ప్రశ్నించారు.