Karnataka | క‌ర్ణాట‌క‌లో ఘోర ప్ర‌మాదం.. ఒకే కుటుంబంలో 10 మంది మృతి

Karnataka | ఓ కుటుంబం విహార‌యాత్ర విషాదంగా మారింది. వారి కారును ఎదురుగా వ‌చ్చిన ప్ర‌యివేటు బ‌స్సు బ‌లంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న వారిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘోర ప్ర‌మాదం క‌ర్ణాట‌క రాష్ట్రంలో సోమ‌వారం సాయంత్రం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారికి చెందిన ఓ కుటుంబం మైసూర్ ట్రిప్‌కు బ‌య‌ల్దేరింది. అయితే టీ న‌ర‌సిపుర వ‌ద్ద ఈ కుటుంబం ప్ర‌యాణిస్తున్న కారును.. ఎదురుగా వ‌చ్చి […]

Karnataka | క‌ర్ణాట‌క‌లో ఘోర ప్ర‌మాదం.. ఒకే కుటుంబంలో 10 మంది మృతి

Karnataka |

ఓ కుటుంబం విహార‌యాత్ర విషాదంగా మారింది. వారి కారును ఎదురుగా వ‌చ్చిన ప్ర‌యివేటు బ‌స్సు బ‌లంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న వారిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘోర ప్ర‌మాదం క‌ర్ణాట‌క రాష్ట్రంలో సోమ‌వారం సాయంత్రం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క‌లోని బ‌ళ్లారికి చెందిన ఓ కుటుంబం మైసూర్ ట్రిప్‌కు బ‌య‌ల్దేరింది. అయితే టీ న‌ర‌సిపుర వ‌ద్ద ఈ కుటుంబం ప్ర‌యాణిస్తున్న కారును.. ఎదురుగా వ‌చ్చి ప్ర‌యివేటు బ‌స్సు బ‌లంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది.

ఇద్ద‌రు చిన్నారులు స‌హా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.