ఫుడ్‌ డెలివరీ కంపెనీలకు ‘న్యూ ఇయర్‌’ పండగ..! సిగ్గీకి నిమిషానికి 1,244 ఆర్డర్లు..!

న్యూ ఇయర్‌ సందర్భంగా డిసెంబర్‌ 31న ఈ కామర్స్‌ కంపెనీలకు భారీగా ఫుడ్‌ ఆర్డర్లు వచ్చాయి

ఫుడ్‌ డెలివరీ కంపెనీలకు ‘న్యూ ఇయర్‌’ పండగ..! సిగ్గీకి నిమిషానికి 1,244 ఆర్డర్లు..!

New Year | న్యూ ఇయర్‌ సందర్భంగా డిసెంబర్‌ 31న ఈ కామర్స్‌ కంపెనీలకు భారీగా ఫుడ్‌ ఆర్డర్లు వచ్చాయి. జొమాటో, బ్లింకిట్‌, స్విగ్గీ, ఫుడ్‌ ఇన్‌స్టామార్ట్‌ తదితర కంపెనీలు ఆర్డర్లు పోటెత్తాయి. సిగ్గీకి బిర్యానీ కోసం ప్రతి నిమిషానికి 1,244 ఆర్డర్లు వచ్చాయి. డిసెంబర్‌ 31 రోజున సిగ్గీ 4.8లక్షల బిర్యానీలు ఆర్డర్లు వచ్చాయి. ఇందులో నాల్గోవంతు హైదరాబాద్‌ నుంచే ఆర్డర్లు వచ్చాయి. గత ఏడాది క్రికెట్ వరల్డ్ కప్‌తో పోలిస్తే కంపెనీ ప్రతి నిమిషానికి 1.6 రెట్లు ఎక్కువ ఆర్డర్‌లను అందుకున్నాయి.


దాదాపు 10 లక్షలకుపైగా ఎక్కువగా బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. కంపెనీకి వచ్చిన ఆర్డర్లన్నీ డెలివరీ చేశామని జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కోల్‌కతాలో ఒకే వ్యక్తి ఒకే ఆర్డర్‌లో 125 ఐటమ్స్‌ను ఆర్డర్‌ చేశాడు. జొమాటోకు మహారాష్ట్ర నుంచి అత్యధిక ఆర్డర్లు వచ్చాయి. కొత్త సంవత్సరం సందర్భంగా స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో సుమారు 2 లక్షల కిలోల ఉల్లిపాయలు, 1.8 లక్షల కిలోల బంగాళాదుంపలు అమ్ముడయ్యాయి.


జొమాటోకు ప్రతి సెకనుకు 140 ఆర్డర్లు


డిసెంబర్‌ 31న రాత్రి 8.06 గంటల జొమాటోలో దాదాపు గంటకు 8,422 ఆర్డర్‌లు వచ్చాయి. అంటే ప్రతి సెకనుకు 140 ఆర్డర్లు అందుకొని డెలివరీ చేసింది. జొమాటో ఆర్డర్లపై డెలివరీ బాయ్స్‌కు దాదాపు రూ.97లక్షల టిప్‌ను అందుకున్నారు. 2015, 2016, 2017, 2018, 2019, 2020లో డెలివరీ చేసినన్ని ఆర్డర్‌లను 2023 డిసెంబర్‌ 31 సందర్భంగా డెలివరీ చేసింది. కంపెనీకి 1.47 లక్షల చిప్స్ ప్యాకెట్లకు ఆర్డర్లు వచ్చాయి. 68,231 సోడా బాటిళ్లను ఆర్డర్ చేశారు. దాదాపు 356 లైటర్లకు ఆర్డర్లు వచ్చాయి.