జార్ఖండ్‌లో ఘోర ప్ర‌మాదం.. 14 మంది స‌జీవ‌ద‌హ‌నం

Jharkhand | జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్‌లో మంగ‌ళ‌వారం రాత్రి ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ అగ్నికీల‌ల‌కు 14 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. మ‌రో 11 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, 10 మంది మ‌హిళ‌లు ఉన్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ధ‌న్‌బాద్ జోరాప‌ఠాక్ ఏరియాలోని 13 అంత‌స్తుల ఆశీర్వాద్ ట‌వ‌ర్‌లో మంగ‌ళ‌వారం రాత్రి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారంతా తీవ్ర భయాందోళ‌న‌ల‌తో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. మంట‌ల ధాటికి 14 మంది చ‌నిపోయారు. […]

జార్ఖండ్‌లో ఘోర ప్ర‌మాదం.. 14 మంది స‌జీవ‌ద‌హ‌నం

Jharkhand | జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్‌లో మంగ‌ళ‌వారం రాత్రి ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ అగ్నికీల‌ల‌కు 14 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. మ‌రో 11 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, 10 మంది మ‌హిళ‌లు ఉన్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ధ‌న్‌బాద్ జోరాప‌ఠాక్ ఏరియాలోని 13 అంత‌స్తుల ఆశీర్వాద్ ట‌వ‌ర్‌లో మంగ‌ళ‌వారం రాత్రి ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారంతా తీవ్ర భయాందోళ‌న‌ల‌తో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. మంట‌ల ధాటికి 14 మంది చ‌నిపోయారు. 11 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, మంట‌ల‌ను ఆర్పేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. మంట‌ల‌ను ఆర్పేందుకు 40 ఫైరింజ‌న్లు గంట‌ల పాటు తీవ్రంగా శ్ర‌మించాయి. అపార్ట్‌మెంట్ వాసుల‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు పోలీసులు.

అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణ‌మేంటి..?

అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. గ్యాస్ సిలిండ‌ర్ పేలిపోవ‌డంతో మంట‌లు చెల‌రేగాయా? లేక పూజ‌ గ‌దిలో మంట‌లు వ్యాపించ‌డం కార‌ణంగా అగ్నిప్ర‌మాదం సంభ‌వించిందా? అన్న కోణంలో పోలీసుల ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. పూజ గ‌ది నుంచే మంట‌లు వ్యాపించిన‌ట్లు స్థానికులు పేర్కొన్నారు.

ప్ర‌ధాని మోదీ, జార్ఖండ్ సీఎం సోరేన్ తీవ్ర దిగ్భ్రాంతి

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించారు. గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని అధికారుల‌ను సీఎం సోరెన్ ఆదేశించారు.