Bus Accident | ఘోర ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి
Bus Accident | బంగ్లాదేశ్‌లో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. జలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకండ వద్ద బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రయివేటు బస్సు భండారియా ఉపజిల్లా నుంచి పిరోజ్‌పూర్‌కు శనివారం బయల్దేరింది. అయితే ఛత్రకండ వద్ద ఆటో రిక్షాకు సైడ్ ఇచ్చేందుకు బస్సు డ్రైవర్ యత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి పక్కనే చెరువులోకి దూసుకెళ్లింది. బస్సు నీటిలో […]
Bus Accident | బంగ్లాదేశ్‌లో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. జలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకండ వద్ద బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రయివేటు బస్సు భండారియా ఉపజిల్లా నుంచి పిరోజ్‌పూర్‌కు శనివారం బయల్దేరింది. అయితే ఛత్రకండ వద్ద ఆటో రిక్షాకు సైడ్ ఇచ్చేందుకు బస్సు డ్రైవర్ యత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి పక్కనే చెరువులోకి దూసుకెళ్లింది. బస్సు నీటిలో మునిగిపోయింది.
ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు మైనర్లు, ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన 35 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 నుంచి 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram