Wrestlers | రెజ్లర్లకు 1983 క్రికెట్ టీం మద్దతు.. ఆరెస్టు తీరు కలచివేసిందని వెల్లడి
విధాత: పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం రోజున అక్కడకి నిరసనగా వెళ్తున్న రెజ్లర్లను (Wrestlers ) పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరుపై.. 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ టీం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు కపిల్ దేవ్, రోజర్ బిన్నీ, సునీల్ గావస్కర్, మొహిందర్ అమరనాథ్, కె. శ్రీకాంత్, సయద్ కిర్మానీ, యశ్‌పాల్ శర్మ, మదన్ లాల్, బిల్వందర్ సింగ్ సంధు, సందీప్ పాటిల్, కీర్తి ఆజాద్‌లతో కూడిన 1983 జట్టు సభ్యులు […]
విధాత: పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం రోజున అక్కడకి నిరసనగా వెళ్తున్న రెజ్లర్లను (Wrestlers ) పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరుపై.. 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ టీం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ మేరకు కపిల్ దేవ్, రోజర్ బిన్నీ, సునీల్ గావస్కర్, మొహిందర్ అమరనాథ్, కె. శ్రీకాంత్, సయద్ కిర్మానీ, యశ్‌పాల్ శర్మ, మదన్ లాల్, బిల్వందర్ సింగ్ సంధు, సందీప్ పాటిల్, కీర్తి ఆజాద్‌లతో కూడిన 1983 జట్టు సభ్యులు లేఖ విడుదల చేశారు.
మే 28న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్న వీడియోలు చూసి కలత చెందాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఎంతో చెమటోడ్చి సాధించిన మెడల్స్‌ను గంగలో కలపడం వంటి కఠిన చర్యలకు పాల్పడవద్దని రెజ్లర్లకు సూచిస్తున్నాం. వారి సమస్యలు త్వరలోనే పరిష్కారమవ్వాలి. చట్టాన్ని తన పని తాను చేయనివ్వాలి అని లేఖలో పేర్కొన్నారు.
సాక్షి మాలిక్ , వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా తదితరులు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్లూఎఫ్‌ఐ ) అధిపతిగా బ్రిజ్ భూషణ్‌ను తొలగించాలని కొద్ది రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తమ పతకాలను గంగలో కలిపేస్తామని హెచ్చరించినప్పటికీ.. తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram