Viral Video | ఒకే చోట 20 సింహాలు.. ఇలాంటి దృశ్యాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు..
Viral Video | ఇలాంటి దృశ్యాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. ఒక వేళ చూసినా.. అదేదో ఏనుగులు సమూహాన్ని, గొర్రెల సమూహాన్ని చూసి ఉంటారు. ఆ విధంగానే అడవికి రారాజు అయిన మృగరాజులు ఒకేచోట ప్రత్యక్షమయ్యాయి. ఒకట్రెండు సింహాలు కాదు.. ఏకంగా 20 సింహాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించాయి. ఆ సింహాలన్నీ ఒకే వరుసలో నిల్చుని నదిలో నీళ్లు తాగాయి. ఈ దృశ్యం చూడటానికి చూడముచ్చటగా ఉంది. ఈ దృశ్యాన్ని నదవ్ ఒస్సెన్‌డ్రైవర్ అనే వ్యక్తి సోషల్ […]

Viral Video | ఇలాంటి దృశ్యాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. ఒక వేళ చూసినా.. అదేదో ఏనుగులు సమూహాన్ని, గొర్రెల సమూహాన్ని చూసి ఉంటారు. ఆ విధంగానే అడవికి రారాజు అయిన మృగరాజులు ఒకేచోట ప్రత్యక్షమయ్యాయి. ఒకట్రెండు సింహాలు కాదు.. ఏకంగా 20 సింహాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించాయి. ఆ సింహాలన్నీ ఒకే వరుసలో నిల్చుని నదిలో నీళ్లు తాగాయి. ఈ దృశ్యం చూడటానికి చూడముచ్చటగా ఉంది.
ఈ దృశ్యాన్ని నదవ్ ఒస్సెన్‌డ్రైవర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని మలమలా గేమ్ రిజర్వ్ ఫారెస్టులో సఫారీకి వెళ్లినప్పుడు ఈ దృశ్యం తమ కెమెరాకు చిక్కిందని నదవ్ పేర్కొన్నాడు. మొదట ఒక సింహాం మాత్రమే కనిపించింది. ఆ తర్వాత వరుసగా.. 20 సింహాలు నది వద్దకు చేరుకుని నీళ్లు తాగిన దృశ్యం తమనెంతో ఆకట్టుకుందని అతను పేర్కొన్నాడు.