Viral Video | పిట్టకొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో..! సింహంపైకి దాడికి వెళ్లిన ముంగీస..!

Viral Video | ఎత్త పెద్ద అడవి జంతువునైనా చంపే సింహాన్ని ఓ చిట్టి ముంగీస భయపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ బొరియలో ముంగీస ఉన్నది. అక్కడే మూడు ఆడ సింహాలున్నాయి. బొరియ నుంచి బయటకు వచ్చిన ముంగీకు సింహం కనిపించగా.. దాన్ని చూస్తూ కోపగించుకుంటూ గట్టిగా అరించింది.

Viral Video | పిట్టకొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో..! సింహంపైకి దాడికి వెళ్లిన ముంగీస..!

Viral Video | ఎత్త పెద్ద అడవి జంతువునైనా చంపే సింహాన్ని ఓ చిట్టి ముంగీస భయపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ బొరియలో ముంగీస ఉన్నది. అక్కడే మూడు ఆడ సింహాలున్నాయి. బొరియ నుంచి బయటకు వచ్చిన ముంగీకు సింహం కనిపించగా.. దాన్ని చూస్తూ కోపగించుకుంటూ గట్టిగా అరించింది. ఆ అరుపులకు ఓ సింహం ఉలిక్కిపడ్డది. ఆ శబ్దాలు విన్న మరో సింహం అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ముంగీస వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. మరో సింహం అడ్డుకుంది.

ఈ సింహాన్ని రావడం చూసిన ముంగీససకు మరింత కోపం కట్టలు తెంచుకొని సింహంపైకి దూసుకువెళ్లడం కనిపించింది. చిట్టి ముంగీస సింహం ముందరి కాళ్లు, ముఖంపై గాయం చేసేందుకు ప్రయత్నించింది. అయితే, సింహం దాన్ని ఏమీ చేయకుండా వెనుకడుగు వేయగా.. మరో సింహం చూస్తుండిపోయింది. చివరకు తోకను సైతం కొరికేందుకు ముంగీస ప్రయత్నించినా తప్పించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోను ఎక్కడ తీసిందో తెలియరాలేదు. నేచర్‌ ఈ అమేజింగ్‌ ‘ఎక్స్‌’ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేయగా.. తెగ రైల్‌ వుతున్నది.

ఇప్పటి వరకు 8.5లక్షల మందికిపైగా వీక్షించారు. తప్పించుకుంది. అయితే ఏ ప్రాంతంలోని అడవిలో, ఎవరు ఈ వీడియోను చిత్రీకరించారో మాత్రం తెలియరాలేదు. క్రేజీ క్లిప్స్‌ పేరుతో ఉన్న హ్యాండిల్ ‘ఎక్స్’లో తొలుత ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన పలువురు నెజిటన్స్‌ ఆ ముంగీస ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెప్పారు. ఆత్మ విశ్వాసం ఉంటే కష్ట సమయాల్లోనూ ఎలాంటి పనిలోనైనా విజయం సాధించవచ్చని చెప్పేందుకు ఈ వీడియోనే నిదర్శనమని పేర్కొంటున్నారు. మరికొందరు యూజర్లు భిన్నంగా స్పందించారు. ‘అడవి జంతవులు ప్రాణ భయంతో పెరిగెత్తితేనే సింహాల్లో వేటాడే గుణం బయటపడుతుందేమో’ అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశాడు.