Mexico | మెక్సికోలో ఘోర ప్ర‌మాదం.. 27 మంది మృతి

Mexico | మెక్సికోలో బుధ‌వారం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌యాణికులతో వెళ్తున్న బ‌స్సు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మ‌రో 17 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలో ఉన్న వివిధ ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ‌స్సులో త‌లెత్తిన లోపమే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని […]

Mexico | మెక్సికోలో ఘోర ప్ర‌మాదం.. 27 మంది మృతి

Mexico | మెక్సికోలో బుధ‌వారం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌యాణికులతో వెళ్తున్న బ‌స్సు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మ‌రో 17 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలో ఉన్న వివిధ ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

బ‌స్సులో త‌లెత్తిన లోపమే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. మంగ‌ళ‌వారం రాత్రి మెక్సికో సిటీ నుంచి శాంటియాగో డీ యోసోడౌకు బ‌య‌ల్దేరగా మార్గ‌మ‌ధ్య‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలిపారు.

బ‌స్సులో స‌మ‌స్య త‌లెత్త‌డంతో డ్రైవ‌ర్ బ‌స్సును కంట్రోల్ చేయ‌లేక‌పోయాడు. దీంతో బ‌స్సు రోడ్డుప‌క్క‌న ఉన్న 80 అడుగుల లోతులో ఉన్న లోయ‌లో ప‌డిపోయింద‌ని పోలీసులు తెలిపారు.