Tamilnadu | 27 ఏండ్ల యువకుడిపై లైంగికదాడి.. వీడియోలతో బెదిరించి నగదు వసూలు
TamilNadu | ఓ ఐదుగురు యువకులు దారుణానికి పాల్పడ్డారు. 27 ఏండ్ల యువకుడిపై లైంగికదాడికి పాల్పడి, ఆ దృశ్యాలను తమ మొబైల్స్‌లో చిత్రీకరించారు. ఆ తర్వాత వీడియోలతో బెదిరించి రూ. 75 వేల నగదు వసూలు చేశారు. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని మణప్పారైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మణప్పారైకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి(27) పుత్తానందం నుంచి మణప్పారైకు బస్సులో బయల్దేరాడు. అదే బస్సులో వండిపేట్లైకు చెందిన అరివళగన్(27) కూడా ప్రయాణిస్తున్నాడు. అయితే […]

TamilNadu |
ఓ ఐదుగురు యువకులు దారుణానికి పాల్పడ్డారు. 27 ఏండ్ల యువకుడిపై లైంగికదాడికి పాల్పడి, ఆ దృశ్యాలను తమ మొబైల్స్‌లో చిత్రీకరించారు. ఆ తర్వాత వీడియోలతో బెదిరించి రూ. 75 వేల నగదు వసూలు చేశారు. ఈ ఘటన తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని మణప్పారైలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మణప్పారైకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి(27) పుత్తానందం నుంచి మణప్పారైకు బస్సులో బయల్దేరాడు. అదే బస్సులో వండిపేట్లైకు చెందిన అరివళగన్(27) కూడా ప్రయాణిస్తున్నాడు. అయితే అరివళగన్.. ఐటీ ఉద్యోగిని టార్గెట్ చేశాడు. తన ఐటీ ఉద్యోగి గొడవ పడ్డాడని చెప్పి తన స్నేహితులకు ఫోన్‌లో చెప్పాడు. దీంతో ఐదుగురు స్నేహితులు మణప్పారై వద్ద ఉన్న కొలను వద్దకు చేరుకున్నారు. ఐటీ ఉద్యోగిని బలవంతంగా బస్సు నుంచి కిందకు దింపారు.
కొలను వద్దకు తీసుకెళ్లి.. ఐదుగురిలో ఇద్దరు వ్యక్తులు ఐటీ ఉద్యోగిపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను చిత్రీకరించి, రూ. 75 వేల నగదు ఇవ్వాలని బెదిరించారు. చేసేదేమీ లేక బాధితుడు వారికి రూ. 75 వేల నగదు ఇచ్చాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఐటీ ఉద్యోగి దుండగులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహమ్మద్ రియాజ్, అరివళగన్, అరుణ్ కుమార్, లియోబ్లాయిడ్, సెంథిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రియాజ్, సెంథిల్ కుమార్ కలిసి గతంలో ఓ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడినట్లు తేలడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.