Milk | ఆ బర్రె పాలు తాగిన గ్రామస్తులకు భయం పట్టుకుంది.. ఎందుకో తెలుసా ?
Milk | విధాత ( ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి) : ఆ గ్రామంలో విక్రయించే బర్రె పాలు అంటేనే జనాలు వణికిపోతున్నారు. వామ్మో ఆ బర్రె పాలా.. మాకొద్దు అంటూ వెనుకడుగు వేస్తున్నారు. అసలు ఆ బర్రె పాలు ఎందుకు వద్దంటున్నారు..? అనే విషయం తెలుసుకోవాలంటే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లక తప్పదు. వివరాల్లోకి వెళ్తే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రానికి చెందిన గొల్ల నానయ్యకు 16 బర్రెలు ఉన్నాయి. నెల […]

Milk |
విధాత ( ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి) : ఆ గ్రామంలో విక్రయించే బర్రె పాలు అంటేనే జనాలు వణికిపోతున్నారు. వామ్మో ఆ బర్రె పాలా.. మాకొద్దు అంటూ వెనుకడుగు వేస్తున్నారు. అసలు ఆ బర్రె పాలు ఎందుకు వద్దంటున్నారు..? అనే విషయం తెలుసుకోవాలంటే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లక తప్పదు.
వివరాల్లోకి వెళ్తే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రానికి చెందిన గొల్ల నానయ్యకు 16 బర్రెలు ఉన్నాయి. నెల రోజుల క్రితం ఒక బర్రెను పిచ్చి కుక్క కరిచింది. ఆ తర్వాత కుక్క కరిచిన బర్రెను వదిలిపెట్టి, మిగతా వాటికి పశు వైద్యాధికారితో టీకాలు వేయించాడు. ఆ మిగిలిన ఒక్క బర్రెకు కూడా టీకా వేయించమని డాక్టర్ చెప్పినప్పటికీ అతను వినిపించుకోలేదు.
ఇక కుక్క కరిచిన బర్రె పాలను గ్రామంలోని దాదాపు 300 మందికి నెల రోజుల నుంచి విక్రయిస్తూనే ఉన్నాడు. అయితే పిచ్చి కుక్క బర్రెను కరిచిందన్న విషయాన్ని దాచి పెట్టాడు నానయ్య. ఇటీవలే ఆ బర్రెకు జన్మించిన దూడ చనిపోయింది. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. నెల రోజులుగా ఆ బర్రె పాలు తాగుతున్న జనాలు వణికిపోతున్నారు. తమకు కూడా ప్రాణా హానీ ఉందా? అని భయపడిపోతున్నారు.
విషయం తెలుసుకున్న వైద్యాధికారులు చింతలమానేపల్లిలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఆ బర్రె పాలు, పెరుగు వినియోగించిన బాధితులందరికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నానయ్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నానయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మెడికల్ క్యాంప్‌ను ఎంపీడీవో మహేందర్, ఎంపీవో సుధాకర్ రెడ్డి, ఎంపీపీ డుబ్బులు నానయ్య, జడ్పీటీసీ శ్రీదేవీ వెంకయ్య సందర్శించి, బాధిత వ్యక్తులకు మనోధైర్యం కల్పించారు.