యూపీలో నెత్తురోడిన రహదారులు.. 31 మంది మృతి
విధాత: ఉత్తరప్రదేశ్‌లో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో 31 మంది మృతి చెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు ప్రమాదాలు గంటల వ్యవధిలోనే చోటు చేసుకున్నాయి.కాన్పూర్ పరిధిలోని ఘటంపూర్ ఏరియాలో భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. చెరువులోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్నావ్‌లో చంద్రిక దేవి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా […]

విధాత: ఉత్తరప్రదేశ్‌లో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో 31 మంది మృతి చెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు ప్రమాదాలు గంటల వ్యవధిలోనే చోటు చేసుకున్నాయి.
కాన్పూర్ పరిధిలోని ఘటంపూర్ ఏరియాలో భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా పడింది.
చెరువులోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఉన్నావ్‌లో చంద్రిక దేవి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కాన్పూర్‌లోని అహిర్వాన్ ఫ్లై ఓవర్ వద్ద ట్రక్కు, టెంపో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 7 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు ప్రమాదాల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రధాని, సీఎం యోగి తీవ్ర దిగ్భ్రాంతి
ఈ రెండు ప్రమాద ఘటనలపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ప్రకటించారు.