Law Student | న్యాయ విద్యార్థిపై కత్తిపోట్లు.. తలకు 15 కుట్లు..
Law Student | మెడిసిన్ ధర( Medicine Price ) విషయంలో తలెత్తిన వివాదం.. తల( Head )పై దాడికి దారి తీసింది. అంతేకాదు.. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న న్యాయ విద్యార్థి( Law Student ) కడుపును కోసేశారు. ఆపై రెండు చేతి వేళ్లను నరికేశారు.
Law Student | లక్నో : మెడిసిన్ ధర( Medicine Price ) విషయంలో తలెత్తిన వివాదం.. తల( Head )పై దాడికి దారి తీసింది. అంతేకాదు.. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న న్యాయ విద్యార్థి( Law Student ) కడుపును కోసేశారు. ఆపై రెండు చేతి వేళ్లను నరికేశారు. ఈ భయానక ఘటన ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని కాన్పూర్( Kanpur )లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
కాన్పూర్‌కు చెందిన అభిజిత్ సింగ్ చందేల్(22) కాన్పూర్ యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ ఫస్టియర్ చదువుతున్నాడు. అయితే ఆదివారం రాత్రి మెడిసిన్స్ కొనేందుకు ఓ మెడికల్ షాపుకు వెళ్లాడు. మెడిసిన్ ధర విషయంలో షాపు ఓనర్, న్యాయ విద్యార్థి మధ్య వివాదం తలెత్తింది.
ఆగ్రహావేశాలతో ఊగిపోయిన షాప్ ఓనర్ అమర్ సింగ్ తన సోదరుడు విజయ్ సింగ్, మరో ఇద్దరు స్నేహితులు రాజ్ శ్రీవాత్సవ, నిఖిల్‌ను పిలిపించాడు. అనంతరం అభిజిత్ సింగ్‌పై దాడి చేశారు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. తన ప్రాణాలను రక్షించుకునేందుకు బాధితుడు తన ఇంటి వైపు పరుగెత్తుతుండగా.. అమర్ సింగ్ వెంబడించాడు. మళ్లీ పదునైన ఆయుధాలతో అభిజిత్ కడుపును కోసేశారు. రెండు చేతి వేళ్లను నరికేశారు.
ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావమై బాధితుడి పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తలకు 15 కుట్లు పడ్డాయి. అభిజిత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram