Green Card | గ్రీన్‌కార్డు కోసం భార‌తీయుల నిరీక్ష‌ణ‌.. 4.24 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు పెండింగ్

Green Card | ఇందులో 90 శాతం భార‌తీయుల‌వే అమెరికాలో ఎంప్లాయ్‌మెంట్‌- బేస్డ్ గ్రీన్‌ కార్డ్స్‌ కోసం18 ల‌క్ష‌ల మంది ఎదురు చూపు రికార్డు స్థాయిలో పెండింగ్ అప్లికేష‌న్లు తాజా నివేదిక‌లో వెల్ల‌డి Green Card | విధాత‌: భార‌త్ నుంచి అమెరికాకు వ‌ల‌స వెళ్లిన చాలా మంది అక్క‌డ శాశ్వ‌త నివాసం (గ్రీన్‌కార్డు) కోసం నిరీక్షిస్తున్నారు. అమెరికా వ‌ద్ద పెండింగ్‌లో 4.24 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉండ‌గా, ఇందులో 90 శాతం భార‌తీయులవే ఉన్నాయి. యునైటెడ్ […]

Green Card | గ్రీన్‌కార్డు కోసం భార‌తీయుల నిరీక్ష‌ణ‌.. 4.24 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు పెండింగ్

Green Card |

  • ఇందులో 90 శాతం భార‌తీయుల‌వే
  • అమెరికాలో ఎంప్లాయ్‌మెంట్‌- బేస్డ్
  • గ్రీన్‌ కార్డ్స్‌ కోసం18 ల‌క్ష‌ల మంది ఎదురు చూపు
  • రికార్డు స్థాయిలో పెండింగ్ అప్లికేష‌న్లు
  • తాజా నివేదిక‌లో వెల్ల‌డి

Green Card | విధాత‌: భార‌త్ నుంచి అమెరికాకు వ‌ల‌స వెళ్లిన చాలా మంది అక్క‌డ శాశ్వ‌త నివాసం (గ్రీన్‌కార్డు) కోసం నిరీక్షిస్తున్నారు. అమెరికా వ‌ద్ద పెండింగ్‌లో 4.24 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉండ‌గా, ఇందులో 90 శాతం భార‌తీయులవే ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్‌లో లీగల్‌ పర్మినెంట్ రెసిడెన్సీకి అందించే ఎంప్లాయ్‌మెంట్‌- బేస్డ్ గ్రీన్‌ కార్డ్స్‌ కోసం ద‌ర‌ఖాస్తుల పెండింగ్ సంఖ్య ఈ ఏడాది రికార్డు స్థాయిలో 18 ల‌క్ష‌లకు చేరింది.

సుదీర్ఘ‌కాలంగా ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉండ‌టం మూలంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలు దూరం కావాల్సిన దుస్థితి నెల‌కొన్న‌ది. తాజా నివేదిక‌లో ఈ అంశం వెల్ల‌డైంది. భార‌త్ నుంచి అనేక మంది విదేశాల‌కు వ‌ల‌స వెళ్తుంటారు. ముఖ్యంగా అమెరికాకు వెళ్లి అక్క‌డ శాశ్వ‌త నివాస హ‌క్కులు పొందిన భార‌తీయులు ల‌క్ష‌ల్లో ఉన్నారు. ఇంకా ఈ వ‌ల‌స‌ల ప‌రంప‌ర‌ కొనసాగుతూనే ఉన్న‌ది. ఈ క్ర‌మంలో గ్రీన్‌కార్డ్‌ కోసం భారతీయులు దాఖ‌లు చేసిన‌ అప్లికేషన్లు భారీగా పేరుకుపోయాయి.

తాజా నివేదిక ప్రకారం.. పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లు, ప్రతి దేశానికి అమెరికా అందించే ఏడు శాతం పరిమితిని పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతం ఉన్న ద‌ర‌ఖాస్తులు పూర్తి కావడానికి 135 ఏండ్ల‌ కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్న‌ది. హెచ్-4 వీసా సిస్టమ్‌లో 21 ఏండ్ల‌లోపు వ్యక్తులు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తారు. కనీసం 80,324 ఉపాధి ఆధారిత అభ్యర్ధనలు పెండింగ్‌లో ఉన్నాయి.

సుమారు 1,71,635 మంది దరఖాస్తుదారులు వారి జీవిత భాగస్వాములు, ఉద్యోగుల మైనర్ పిల్లలను కలిగి ఉన్నారు. మరో 13 లక్షల దరఖాస్తులు వెయిట్‌లిస్ట్‌లో ఉన్నాయి. 2.89 లక్షల దరఖాస్తులు సర్దుబాటు ప్రిక్రియ‌లో పెండింగ్‌లో ఉన్నాయి. కొంతమంది ఉపాధి ఆధారిత వలసదారులు విదేశాల్లోని కాన్సులేట్‌లలో వలస వీసా తీర్పుల కోసం వేచి ఉన్నారు.

అమెరికాలో గ్రీన్‌కార్డుల కోసం .4.24 లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. వీరిలో 90 శాతం మంది భారతీయులే ఉన్నారు. చైనీస్ దరఖాస్తుదారులు 17 ఏండ్లుగా నిరీక్షిస్తున్నారు. ఇత‌ర దేశాల‌కు చెందిన వారి అప్లికేష‌న్లు కూడా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి.