Ramachandra Yadav | ఒకే రోజు 50 వేల ఉద్యోగాలు.. రామచంద్రయాదవ్ భారీ ఉద్యోగమేళా

Ramachandra Yadav | విధాత: రాయలసీమలో టీడీపీ, వైసీపీలోని పెద్దనాయకులకు ఏమాత్రం తీసిపోని విధంగా కొత్త పార్టీని భారీగా ప్రకటించిన రామచంద్రయాదవ్.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టును చేపడుతున్నారు. ఆమధ్య భారత చైతన్య యువజన పార్టీని భారీ సభలో ప్రకటించిన ఆయన, ఇప్పుడు యువతను ఆకట్టుకునేందుకు ఉపాధి అవకాశాలు గురించి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. భారీగా ఆస్తులు, పారిశ్రామిక సంస్థల్లో భాగస్వామ్యాలు కలిగి బిగ్ షాట్ అని గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే అయన భారీ స్థాయిలో […]

  • By: krs    latest    Aug 27, 2023 12:19 PM IST
Ramachandra Yadav | ఒకే రోజు 50 వేల ఉద్యోగాలు.. రామచంద్రయాదవ్ భారీ ఉద్యోగమేళా

Ramachandra Yadav |

విధాత: రాయలసీమలో టీడీపీ, వైసీపీలోని పెద్దనాయకులకు ఏమాత్రం తీసిపోని విధంగా కొత్త పార్టీని భారీగా ప్రకటించిన రామచంద్రయాదవ్.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టును చేపడుతున్నారు. ఆమధ్య భారత చైతన్య యువజన పార్టీని భారీ సభలో ప్రకటించిన ఆయన, ఇప్పుడు యువతను ఆకట్టుకునేందుకు ఉపాధి అవకాశాలు గురించి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

భారీగా ఆస్తులు, పారిశ్రామిక సంస్థల్లో భాగస్వామ్యాలు కలిగి బిగ్ షాట్ అని గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే అయన భారీ స్థాయిలో సొంత పార్టీని ప్రకటించారు. బీజేపీ అండదండలు ఉన్నాయని చెబుతున్న అయన బీసీల గొంతు వినిపించేందుకు ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ఈ క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద సెప్టెంబర్ 2, 3 తేదీల్లో భారీ ఉద్యోగమేళా నిర్వహిస్తున్నారు. తనకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వ్యాపార భాగస్వామ్యం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో గరిష్టంగా లక్షన్నర వరకూ జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తానని అంటున్నారు. ఈ మేళాకు వచ్చే వాళ్లకు భోజనం సైతం ఉచితం అని చెబుతూ భారీగా ప్రచారం చేస్తున్నారు.