విధాత, ఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్న 5జీ టెలికం సేవలు మన దేశంలోనూ మొదలయ్యాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌ను ప్రారంభించి, 5 జీ సర్వీసెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు.
ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలిదశలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రాం, లక్నోలో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
రెండేళ్లలో దేశమంతటా 5 జీ సేవలు విస్తరించనున్నారు. ఇప్పటికే అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. అక్కడా ఈ సేవలు కొన్ని నగరాల్లోనే ఉన్నాయి. 5జీ సేవలు ప్రారంభించడానికి ముందు.. టెలికాం సంస్థల స్టాళ్లను మోదీ పరిశీలించారు.

అక్కడి స్టాళ్లలో కలియతిరిగారు. జియో, ఎయిర్టెల్ సహా పలు సంస్థల 5జీ ఉత్పత్తులను వీక్షించారు. ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తుల గురించి మోదీకి వివరించారు. ప్రత్యేక కళ్లద్దాలు ధరించి వీడియోలు వీక్షించారు. ఓ స్టాల్లో వీడియో గేమ్ సైతం ఆడారు.
Latest News
జిమ్ జిమ్ తార’ పాట తో ‘పర్ణశాల’ మూవీ టీమ్ మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్ స్కెచ్!
చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం
చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా ‘పోతిరెడ్డిపల్లి’ మూవీ ప్రారంభం
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల