దుర్గామాత మందిరంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
విధాత : దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రులు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని భాదోయిలోని దుర్గామాత మందిరంలో అపశ్రుతి చోటు చేసుకుంది. హారతి ఇస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు మండపానికి వ్యాపించారు. దీంతో సుమారు 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో మండపంలో 150 మంది దాకా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముగ్గురు మృతుల్లో 45 ఏండ్ల మహిళ, 10, 12 […]

విధాత : దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రులు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని భాదోయిలోని దుర్గామాత మందిరంలో అపశ్రుతి చోటు చేసుకుంది. హారతి ఇస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు మండపానికి వ్యాపించారు. దీంతో సుమారు 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారు.
అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో మండపంలో 150 మంది దాకా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముగ్గురు మృతుల్లో 45 ఏండ్ల మహిళ, 10, 12 ఏండ్ల వయసున్న ఇద్దరు బాలురు ఉన్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అయితే హారతి అక్కడున్న విద్యుత్ తీగలకు తాకడంతో విద్యుత్ షాక్ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.