7/G బృందావన్ కాలనీ: 20 ఏండ్ల తర్వాత.. ఇప్పుడు సీక్వెల్..!
విధాత: ఏఎం రత్నం ఒకప్పుడు అగ్ర నిర్మాతగా ఓ వెలుగు వెలిగారు. జెంటిల్‌మెన్, ఒకేఒక్కడు, భారతీయుడు వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించాడు. ఆపై పెద్దరికం సనిమాకు దర్శకత్వం వహించి మంచి విజయం కూడా సాధించారు. అలాంటి రత్నం మంచి సక్సెస్‌లో ఉన్న సమయంలోనే తన కుమారుడు రవికృష్ణను హీరోగా పరిచయం చేస్తూ 7/జీ బృందావన్ కాలనీ అనే చిత్రం తీశారు. ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్. యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. సుమన్ శెట్టి హాస్యం […]

విధాత: ఏఎం రత్నం ఒకప్పుడు అగ్ర నిర్మాతగా ఓ వెలుగు వెలిగారు. జెంటిల్‌మెన్, ఒకేఒక్కడు, భారతీయుడు వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించాడు. ఆపై పెద్దరికం సనిమాకు దర్శకత్వం వహించి మంచి విజయం కూడా సాధించారు. అలాంటి రత్నం మంచి సక్సెస్‌లో ఉన్న సమయంలోనే తన కుమారుడు రవికృష్ణను హీరోగా పరిచయం చేస్తూ 7/జీ బృందావన్ కాలనీ అనే చిత్రం తీశారు. ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్. యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది.
సుమన్ శెట్టి హాస్యం ఇప్పటికీ అందరిని అలరిస్తూనే ఉంది. ఈ చిత్రంలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ మధ్య కెమిస్ట్రీని, రొమాన్స్ సీన్స్ ను దర్శకుడు సెల్వరాఘవన్ అద్భుతంగా తెరకెక్కించగా యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు బ్లాక్ బస్టర్. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ చిత్రాలు మెచ్చే వారికి ఈ సినిమా ఎంతగానో నచ్చుతుంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. 7/జీ బృందావన కాలనీ సినిమాకు సీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది. ఆమధ్య ఈ విషయాన్ని స్వయంగా ఎ.యం.రత్నమే తెలిపారు. ఇప్పుడు ఆ ప్రచారం మరలా తెరపైకి వచ్చింది. ఇందులో హీరో హీరోయిన్లు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే రవి కృష్ణ సోనియా అగర్వాల్ ఉండకపోవచ్చని సమాచారం. కానీ తన కుమారుడిని కాదని రత్నం వేరెవరినో ఎందుకు పెట్టుకుంటాడు? కానీ ప్రస్తుతం రవికృష్ణనే ఎవ్వరికీ తెలిదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫేడవుట్ అయిపోయారు. రవి కృష్ణ అయితే ఈ సినిమా తర్వాత చేసిన శుక్రన్, కేడీ, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, నిన్న నేడు రేపు వంటి కొన్ని చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి.
చాలా కాలంగా అయినా నటనకు దూరంగా ఉంటున్నారు. కాగా ప్రస్తుతం రత్నం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే చిత్రం తీస్తున్నారు. పవన్‌తో రత్నం చేస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇంతకు ముందు ఆయన పవన్‌తో ఖుషీ, బంగారం చిత్రాలను నిర్మించారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రత్నం 7/ జి బృందావన్ కాలనీ సీక్వెల్‌పై దృష్టి పెడతారని తెలుస్తోంది.