Sircilla | సిరిసిల్ల జిల్లాలో.. 80 నాటు బాంబులు స్వాధీనం

కోనరావుపేట మండలంలో తయారీ Sircilla | విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో పోలీసులు గురువారం 80 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో నాటు బాంబులు తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గ్రమాంలోజరిపిన సోదాల్లో నాటు బాంబులు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన పిట్టల రాజలింగం ఇంట్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా నాటు తుపాకీ కలిగి ఉన్నకేసులో రాజలింగం జైలుకు వెళ్లి వచ్చారు. కాగా, […]

  • By: Somu    latest    Sep 07, 2023 12:43 PM IST
Sircilla | సిరిసిల్ల జిల్లాలో.. 80 నాటు బాంబులు స్వాధీనం
  • కోనరావుపేట మండలంలో తయారీ

Sircilla | విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో పోలీసులు గురువారం 80 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో నాటు బాంబులు తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గ్రమాంలోజరిపిన సోదాల్లో నాటు బాంబులు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన పిట్టల రాజలింగం ఇంట్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా నాటు తుపాకీ కలిగి ఉన్నకేసులో రాజలింగం జైలుకు వెళ్లి వచ్చారు.

కాగా, కోనరావుపేట మండలంలో నాటు బాంబుల తయారీ నిత్యకృత్యంగా మారింది. ఇటీవల కాలంలోనే ఇందుకు సంబంధించి రెండు కేసులు నమోదు కాగా, తాజాగా నాటుబాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతం కావడం, అడవి పందుల బెడద ఎక్కువగా ఉండడం, వాటి కారణంగా పంట పొలాలకు నష్టం వాటిల్లుతోంది.

అడవి పందుల బెడద నుంచి తప్పించుకునేందుకు స్థానిక రైతులు ఫాస్పరస్ తో తయారుచేసిన నాటు బాంబులను ఉపయోగిస్తున్నారు. ఇలాంటివి మనుషులకు అంత హానికరం కాకపోయినప్పటికీ, చట్ట విరుద్ధం అయినందున రాజలింగంపై ఎక్స్ ప్లోజివ్స్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న కోనరావుపేట ఎస్సై ఆంజనేయులు, ఏఎస్ఐ రఘుపతి రెడ్డి, సీసీఎస్ పోలీసులను జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ అభినందించారు.