Heart Attack | జిమ్ చేస్తూ.. 19ఏళ్ల యువకుడు మృతి

Heart Attack | విధాత: దేశంలో కొంతకాలంగా గుండెపోటు మరణాలు నానాటికి పెరిగిపోతున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి పెద్ద వయసు వారి వరకు గుండెపోటుతో ఆకస్మిక మరణాలకు గురవుతున్నారు. తాజాగా యూపీలోని ఘజియాబాద్‌లో ఓ జిమ్‌లో 19ఏళ్ల యువకుడు వ్యాయమం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ట్రేడ్‌మిల్‌పై వ్యాయంలో భాగంగా నడుస్తునే కార్డియాక్ అరెస్టుతో అతను ఒక్కసారిగా కుప్పకూలాడు. తెలంగాణలో ములుగు జిల్లా - వాజేడు మండల కేంద్రానికి చెందిన గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడు […]

  • Publish Date - September 17, 2023 / 12:32 PM IST

Heart Attack |

విధాత: దేశంలో కొంతకాలంగా గుండెపోటు మరణాలు నానాటికి పెరిగిపోతున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నారుల నుంచి పెద్ద వయసు వారి వరకు గుండెపోటుతో ఆకస్మిక మరణాలకు గురవుతున్నారు.

తాజాగా యూపీలోని ఘజియాబాద్‌లో ఓ జిమ్‌లో 19ఏళ్ల యువకుడు వ్యాయమం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ట్రేడ్‌మిల్‌పై వ్యాయంలో భాగంగా నడుస్తునే కార్డియాక్ అరెస్టుతో అతను ఒక్కసారిగా కుప్పకూలాడు.

తెలంగాణలో ములుగు జిల్లా – వాజేడు మండల కేంద్రానికి చెందిన గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడు సూత్రపు హరిచందర్ కు ఇంట్లో ఉండగానే గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే అతను మార్గమధ్యలో మృతి చెందాడు. హరిచందర్‌ చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు.