Copperhead Snake Camouflage | ఎండుటాకుల్లో దాగి ఉన్న పాము.. కనిపెడితే మీరు గ్రేట్‌!

కొన్ని రకాల పాములు.. వాటి రక్షణ కోసం తమ చుట్టుపక్కల వాతావరణంలోకి ఒదిగిపోతాయి. అలాంటి ఒక పాము ఈ ఫొటోలో ఉంది. అది ఎక్కడ ఉందో గుర్తుపట్టగలరా?

Copperhead Snake Camouflage | ఎండుటాకుల్లో దాగి ఉన్న పాము.. కనిపెడితే మీరు గ్రేట్‌!

Copperhead Snake Camouflage | కొన్ని పాములు అడవుల్లో పచ్చని చెట్లలో, లేదా ఎండిన ఆకులలో కలిసిపోయి ఉంటాయి. తమ ఆహారం కోసం వేచిచూస్తుంటాయి. ఈ ఫొటో కూడా అలాంటిదే. ఒక కాపర్‌హెడ్‌ పాము (Agkistrodon contortrix).. ఎండుటాకుల మధ్య వాటిలో కలిసిపోయిన చిత్రం ఇది. కాపర్‌హెడ్‌ పాము కాటుకు గురైనవారి కేసులలో అత్యధికం అది ఎండుటాకుల్లో కలిసిపోయి.. మనిషి కంటికి స్పష్టంగా కనిపించకపోవడమే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికాలో కాపర్‌హెడ్‌ పాము కాట్లు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. సీడీసీ డాటా ప్రకారం.. ఏటా అమెరికాలో 2,500 మంది ఈ పాము కాట్లకు గురవుతూ ఉంటారు.

ఇది విషపూరితమైన పామే కానీ.. ఇది కాటు వేస్తే మరణించే అవకాశాలు 0.01శాతం కంటే తక్కువ ఉంటాయి. ఇవి తమకు ముప్పు ఉందని తెలిస్తే పారిపోవడం కాకుండా.. నేలపై పడి ఉండే ఎండుటాకుల మధ్య కదలకుండా ఉండిపోతాయి. సరిగ్గా ఈ ఫొటోలో ఉన్నట్టనమాట. ఈ ఫొటోను Nature is Amazing ఎక్స్‌ హ్యాండిల్‌లో పోస్టు చేశారు. ఇవి మధ్యస్థంగా, బలంగా ఉంటాయి. శరీరంపై గంట ఆకారంలో మచ్చలను కలిగి ఉంటాయి. ఇవి పర్యావరణహిత పాములు. పంటలను నాశనం చేసే ఎలుకల సంఖ్య గణనీయంగా తగ్గించడంలో వీటిదే కీలక పాత్ర. ఈ పోస్టుకు స్పందించిన నెటిజన్లు ఇటువంటి పలు రకాల ఫొటోలు, వీడియోలు పంచుకున్నారు.