కేసీఆర్ పేరుపై మట్టి పూసిన వ్యక్తిపై కేసు నమోదు

జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో శుక్రవారం ప్రజా దర్బార్ సందర్భంగా శిలాఫలకంపై ఉన్న కేసీఆర్ పేరుపై మట్టి పూసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

  • By: Somu    latest    Dec 09, 2023 10:31 AM IST
కేసీఆర్ పేరుపై మట్టి పూసిన వ్యక్తిపై కేసు నమోదు

విధాత: జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లో శుక్రవారం ప్రజా దర్బార్ సందర్భంగా శిలాఫలకంపై ఉన్న కేసీఆర్ పేరుపై మట్టి పూసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన యూత్ కాంగ్రెస్ నాయకులు రాజేష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న ప్రజాభవన్ లో తొలిసారి ప్రజా దర్బార్ నిర్వహించారు.


ఈ క్రమంలో ప్రజాభవన్‌కు వెళ్లిన రాజేశ్ రెడ్డి ప్రజాభవన్ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ శిలాఫలకంపై ఉన్న కేసీఆర్ పేరుపై మట్టి పూశాడు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా బీఆరెస్ ఈ చర్యను ఖండించింది. పోలీసులు దీనిపై స్పందించి ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు