Hyderabad | కూతురి మరణాన్ని తట్టుకోలేక.. తండ్రి ఆత్మహత్యాయత్నం
Hyderabad | కూతురి మరణాన్ని తట్టుకోలేక.. తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం రాత్రి ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖైరతాబాద్‌కు చెందిన కొమ్ముల కిశోర్ కుమార్(40) ప్రయివేటు ఉద్యోగి. ఆయనకు భార్య ప్రియాంక, ఇద్దరు కుమార్తెలు ఆరాధ్య(4), ఆధ్య ఉన్నారు. కిశోర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం బోయిన్‌పల్లిలో ఓ శుభకార్యానికి వెళ్లారు. పని ఉండటంతో కొద్ది సేపటికే కిశోర్ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేశాడు. అనంతరం […]

Hyderabad |
కూతురి మరణాన్ని తట్టుకోలేక.. తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం రాత్రి ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖైరతాబాద్‌కు చెందిన కొమ్ముల కిశోర్ కుమార్(40) ప్రయివేటు ఉద్యోగి. ఆయనకు భార్య ప్రియాంక, ఇద్దరు కుమార్తెలు ఆరాధ్య(4), ఆధ్య ఉన్నారు.
కిశోర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సాయంత్రం బోయిన్‌పల్లిలో ఓ శుభకార్యానికి వెళ్లారు. పని ఉండటంతో కొద్ది సేపటికే కిశోర్ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేశాడు. అనంతరం ఆరాధ్య ఏడుస్తుండటం తో కుటుంబ సభ్యులు కిశోర్‌కు ఫోన్ చేశారు. దీంతో కిశోర్ అక్కడికెళ్లి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాడు.
కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్న ఆరాధ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే.. సాయంత్రం 6:30 గంటల సమయంలో సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తన బిడ్డ మరణించిందని వైద్యులు తెలుపడంతో కిశోర్ గుండెలవిసేలా రోదించాడు. నా కూతురు చనిపోయింది.. నేను బతకలేను అంటూ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వాట్సాప్‌లో సందేశం పంపాడు. రైల్వేట్రాక్‌పై చనిపోతున్నానంటూ పేర్కొన్నాడు.
దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. కిశోర్ ఆచూకీ కోసం గాలించగా, రాత్రి 11:30 గంటల సమయంలో ఖైరతాబాద్ పోస్టాఫీసు వెనుక రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యమైంది. కూతురు, తండ్రి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.