Yadadri | య‌జ‌మాని మాదిరే.. మ‌ద్యానికి బానిసైన మేక పిల్ల‌..

Yadadri | విధాత: మ‌ద్యం పేరు విన‌గానే మందు బాబుల‌కు హుషారు వ‌స్తుంది. మ‌ద్యం సేవించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. మద్యం సేవించొద్దు అని చెప్పినా కూడా ప‌ట్టించుకోరు. త‌మ‌కు గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా మ‌ద్యం షాపుల ముందు వాలిపోతుంటారు మద్యం ప్రియులు. ఆ మాదిరిగానే ఓ మేక (Goat) కూడా మ‌ద్యానికి బానిసైంది. సాయంత్రం కాగానే త‌న య‌జ‌మాని వ‌ద్ద‌కు వెళ్లి మ‌ద్యం కోసం ఎదురుచూస్తుంది. మ‌రి ఆ మేక గురించి తెలుసుకోవాలంటే యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ( Yadadri Bhuvanagiri) […]

Yadadri | య‌జ‌మాని మాదిరే.. మ‌ద్యానికి బానిసైన మేక పిల్ల‌..

Yadadri |

విధాత: మ‌ద్యం పేరు విన‌గానే మందు బాబుల‌కు హుషారు వ‌స్తుంది. మ‌ద్యం సేవించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. మద్యం సేవించొద్దు అని చెప్పినా కూడా ప‌ట్టించుకోరు. త‌మ‌కు గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా మ‌ద్యం షాపుల ముందు వాలిపోతుంటారు మద్యం ప్రియులు.

ఆ మాదిరిగానే ఓ మేక (Goat) కూడా మ‌ద్యానికి బానిసైంది. సాయంత్రం కాగానే త‌న య‌జ‌మాని వ‌ద్ద‌కు వెళ్లి మ‌ద్యం కోసం ఎదురుచూస్తుంది. మ‌రి ఆ మేక గురించి తెలుసుకోవాలంటే యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ( Yadadri Bhuvanagiri) కు వెళ్లాల్సిందే.

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ఆత్మ‌కూరు(ఎం) మండ‌లం మెదుగుంట‌కు చెందిన సోలిపురం ర‌వీంద‌ర్ రెడ్డి అనే రైతు.. ఓ మేక(Goat)ను పెంచుకుంటున్నాడు. ర‌వీంద‌ర్ రెడ్డికి మ‌ద్యం తాగే అల‌వాటు ఉంది. సాయంత్రం కాగానే ఇంటి వ‌ద్దే ఆయ‌న మ‌ద్యం సేవిస్తుంటాడు.

అయితే ఓ రోజు మేక‌కు కూడా మ‌ద్యం ప‌ట్టించాడు. అంతే ఇక ఆ మ‌రుస‌టి రోజు నుంచి సాయంత్రం అయ్యేస‌రికి రైతు ముందు మేక వాలిపోతోంది. మ‌ద్యం సేవించిన వెంట‌నే మ‌త్తులో నిద్ర‌లోకి జారుకుంటుంది ఆ మేక‌. మ‌ద్యం సేవిస్తున్న ఆ మేకను స్థానికులు ఆస‌క్తిగా ప‌రిశీలిస్తున్నారు.