Python | బాచుపల్లిలో భారీ కొండచిలువ.. భయాందోళనకు గురైన స్థానికులు
Python విధాత: బాచుపల్లిలో ఓ భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. ఎన్ఆర్ఐ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి కొండచిలువ ప్రవేశించింది. దాదాపు ఐదు అడుగుల పొడవున్న ఆ పైథాన్‌ను చూసి అపార్ట్‌మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఎన్ఆర్ఐ కాలనీలోని ఆ అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్న స్నేక్ క్యాచర్స్.. భారీ పైథాన్‌ను పట్టుకున్నారు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో […]

Python
విధాత: బాచుపల్లిలో ఓ భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. ఎన్ఆర్ఐ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి కొండచిలువ ప్రవేశించింది. దాదాపు ఐదు అడుగుల పొడవున్న ఆ పైథాన్‌ను చూసి అపార్ట్‌మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు.
తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఎన్ఆర్ఐ కాలనీలోని ఆ అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్న స్నేక్ క్యాచర్స్.. భారీ పైథాన్‌ను పట్టుకున్నారు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
అయితే రెండు రోజుల క్రితం వరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వానలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. కుండపోత వర్షాలకు నగర శివార్లలో ఉన్న చెరువులు అలుగు పారాయి. ఎన్ఆర్ఐ కాలనీకి సమీపంలోని తుర్క చెరువు నుంచి కొండచిలువ అపార్ట్‌మెంట్‌లోకి దూరి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.