Lovers | లవర్‌తో వీడియో కాల్ మాట్లాడుతూ.. మర్మాంగాన్ని కోసుకున్న ప్రియుడు
Lovers | ఇద్దరు ప్రేమికుల మధ్య గొడవలు సర్వసాధారణం. ఒక వేళ గొడవలు ఎక్కువైతే బ్రేకప్ చెప్పేస్తుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం తన లవర్‌తో గొడవపడి మర్మాంగాన్ని( Penis Cut ) కోసుకున్నాడు. అది కూడా ప్రియురాలితో వీడియో కాల్( Video Call ) మాట్లాడుతూనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్( Gujarat )లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్( West Bengal )లోని కుచ్చెహర్ ప్రాంతానికి చెందిన ప్రసన్నజీత్ […]

Lovers | ఇద్దరు ప్రేమికుల మధ్య గొడవలు సర్వసాధారణం. ఒక వేళ గొడవలు ఎక్కువైతే బ్రేకప్ చెప్పేస్తుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం తన లవర్‌తో గొడవపడి మర్మాంగాన్ని( Penis Cut ) కోసుకున్నాడు. అది కూడా ప్రియురాలితో వీడియో కాల్( Video Call ) మాట్లాడుతూనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్( Gujarat )లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్( West Bengal )లోని కుచ్చెహర్ ప్రాంతానికి చెందిన ప్రసన్నజీత్ బర్మన్.. గుజరాత్‌లోని రాజ్‌కోట్( Rajkot )లో తన మామయ్యతో కలిసి ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ యువతి( Woman )తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆమెతో తరుచుగా వీడియో కాల్స్ మాట్లాడేవాడు ప్రసన్న. ఇటీవలే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక లవర్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడుతూనే.. ఆవేశంతో తన మర్మాంగాన్ని బ్లేడ్‌తో కోసుకున్నాడు.
మామ ఇంటికి వచ్చి చూసేసరికి ప్రసన్న తీవ్ర రక్త స్రావంతో బాధపడుతున్నాడు. స్పృహ కోల్పోయాడు. దీంతో హుటాహుటిన ప్రసన్నను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రసన్నకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం బాధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.