Viral Video | మొస‌ళ్ల గుంపు మ‌ధ్య బోటు రైడ్.. వీడిదేం సాహ‌సం రా బాబు..!

crocodiles | Viral Video | విధాత: మొస‌లిని చూసినా.. ఆ పేరు విన్నా గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. ఒళ్లంతా చెమ‌ట‌లు ప‌ట్టేస్తాయి. మొస‌లి ఉన్న ప్రాంతం వైపు వెళ్లేందుకు ధైర్యం చేయం. కానీ ఓ వ్య‌క్తి మాత్రం మొస‌ళ్ల‌కు ఆవాసంగా ఉన్న ఓ న‌దిలోకి వెళ్లాడు. ఏ మాత్రం బెద‌ర‌కుండా, వ‌ణ‌క‌కుండా.. మొస‌ళ్ల మ‌ధ్య త‌న బోటుతో ప్ర‌యాణించాడు. మొస‌ళ్ల గుంపు మ‌ధ్య బోటు రైడ్.. వీడిదేం సాహ‌సం రా బాబు..! https://t.co/KPoo0Ilkxh #VIRAL #viralvideo […]

  • By: raj    latest    Aug 20, 2023 2:27 AM IST
Viral Video | మొస‌ళ్ల గుంపు మ‌ధ్య బోటు రైడ్.. వీడిదేం సాహ‌సం రా బాబు..!

crocodiles | Viral Video |

విధాత: మొస‌లిని చూసినా.. ఆ పేరు విన్నా గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. ఒళ్లంతా చెమ‌ట‌లు ప‌ట్టేస్తాయి. మొస‌లి ఉన్న ప్రాంతం వైపు వెళ్లేందుకు ధైర్యం చేయం. కానీ ఓ వ్య‌క్తి మాత్రం మొస‌ళ్ల‌కు ఆవాసంగా ఉన్న ఓ న‌దిలోకి వెళ్లాడు. ఏ మాత్రం బెద‌ర‌కుండా, వ‌ణ‌క‌కుండా.. మొస‌ళ్ల మ‌ధ్య త‌న బోటుతో ప్ర‌యాణించాడు.

అయితే ఆ న‌దిలో ఒక‌ట్రెండు మొస‌ళ్లు లేవు.. కొన్ని వంద‌ల సంఖ్య‌లో ఉన్నాయి. అయితే బోటు శ‌బ్దానికి మొస‌ళ్లు ప‌రారీ అయ్యాయి. న‌ది ఒడ్డుకు పారిపోయాయి. ఇది ఎక్క‌డ‌, ఎప్పుడు జ‌రిగిందో తెలియ‌దు.

మొస‌ళ్ల మ‌ధ్య బోటుతో ఓ వ్య‌క్తి దూసుకెళ్లిన దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాల‌ను చూసి నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. అంత ప్ర‌మాద‌క‌ర న‌దిలో నుంచి ఎందుకు వెళ్లారు? అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.