స్నేహమంటే ఇదేరా.. జింకపై కోతి షికారు.. వీడియో వైరల్
విధాత: స్నేహమంటే ఇలా ఉండాలి. జాతి వైరం మరిచిన ఆ జంతువులు.. కలిసిమెలిసి ఉన్నాయి. ఆ జంతువుల స్నేహాన్ని చూస్తుంటే భలే అనిపిస్తోంది. ఆ వీడియో కూడా అంత చూడముచ్చటగా ఉంది. ఆ మూగజీవాల స్నేహానికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. మన హృదయాలను కూడా కదిలింపజేస్తోంది ఆ వీడియో. ఐఐటీ మద్రాస్‌లో ఓ జింక గడ్డి కోసం తిరుగుతోంది. అదే జింకపై ఓ కోతి కూర్చొని షికారు చేసింది. జింక ఏ మాత్రం ఇబ్బంది పడకుండా […]

విధాత: స్నేహమంటే ఇలా ఉండాలి. జాతి వైరం మరిచిన ఆ జంతువులు.. కలిసిమెలిసి ఉన్నాయి. ఆ జంతువుల స్నేహాన్ని చూస్తుంటే భలే అనిపిస్తోంది. ఆ వీడియో కూడా అంత చూడముచ్చటగా ఉంది. ఆ మూగజీవాల స్నేహానికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. మన హృదయాలను కూడా కదిలింపజేస్తోంది ఆ వీడియో.
ఐఐటీ మద్రాస్‌లో ఓ జింక గడ్డి కోసం తిరుగుతోంది. అదే జింకపై ఓ కోతి కూర్చొని షికారు చేసింది. జింక ఏ మాత్రం ఇబ్బంది పడకుండా కోతిని మోస్తూ.. గడ్డి కోసం క్యాంపస్ అంతా కలియతిరిగింది. ఈ దృశ్యాలను ఓ యువకుడు తన మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోను షేర్ చేసిన 14 గంటల్లోనే 54 వేల మంది వీక్షించారు.
ఇక ఓ నెటిజన్ ఇలా స్పందించాడు. ఉబెర్ ఫర్ ఏనిమల్స్ అని పేర్కొన్నాడు. జాతి వైరం మరిచి ఏం చక్కగా తిరుగుతున్నాయని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. విద్యార్థులు క్లాసులను డుమ్మా కొట్టేందుకు ఈ విధంగానే చేస్తారని మరొకరు రాశారు. ఈ జంతువుల స్నేహం గొప్పదని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.