Bride | తాళి క‌ట్టే వేళ‌.. వ‌ధువును బ‌ల‌వంతంగా లాక్కెళ్లిన పోలీసులు

Bride | ప్రేమించిన వాడితో మూడు ముళ్లు.. ఏడు అడుగుల బంధంతో ఒక్క‌ట‌య్యే స‌మ‌యం అది. తాళి క‌ట్టేందుకు వ‌రుడు సిద్ధ‌ప‌డుతుండ‌గా, పెళ్లి పీట‌ల‌పై కూర్చున్న వ‌ధువును పోలీసులు బ‌ల‌వంతంగా లాక్కెళ్లారు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని అల‌ప్పుజ జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. అల‌ప్పుజ జిల్లాలోని కోవ‌లం ప్రాంతానికి చెందిన అల్ఫియా, అఖిల్ గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్ద‌రి మ‌తాలు వేరు కావ‌డంతో.. పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రించ‌లేదు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన […]

Bride | తాళి క‌ట్టే వేళ‌.. వ‌ధువును బ‌ల‌వంతంగా లాక్కెళ్లిన పోలీసులు

Bride | ప్రేమించిన వాడితో మూడు ముళ్లు.. ఏడు అడుగుల బంధంతో ఒక్క‌ట‌య్యే స‌మ‌యం అది. తాళి క‌ట్టేందుకు వ‌రుడు సిద్ధ‌ప‌డుతుండ‌గా, పెళ్లి పీట‌ల‌పై కూర్చున్న వ‌ధువును పోలీసులు బ‌ల‌వంతంగా లాక్కెళ్లారు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని అల‌ప్పుజ జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. అల‌ప్పుజ జిల్లాలోని కోవ‌లం ప్రాంతానికి చెందిన అల్ఫియా, అఖిల్ గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్ద‌రి మ‌తాలు వేరు కావ‌డంతో.. పెళ్లికి పెద్ద‌లు అంగీక‌రించ‌లేదు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఇద్ద‌రు.. స్థానిక ఆల‌యంలో వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇక వ‌రుడు వ‌ధువు మెడ‌లో తాళి క‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడు. స‌రిగ్గా ఇదే స‌మ‌యానికి పోలీసులు అక్క‌డ వాలిపోయి వ‌ధువును బ‌ల‌వంతంగా తీసుకెళ్లారు. ఆమెను పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు పోలీసులు.

అనంత‌రం అల్ఫియాను కోర్టులో హాజ‌రుప‌రిచారు. మేజ‌ర్ అయిన తాను అఖిల్‌తోనే ఉంటాన‌ని చెప్ప‌డంతో కోర్టు అందుకు అంగీక‌రించింది. దీంతో ఇద్ద‌రు ప్రేమికులు కోర్టు నుంచి వెళ్లిపోయారు. మ‌ళ్లీ మంగ‌ళ‌వారం పెళ్లి చేసుకునేందుకు అల్ఫియా, అఖిల్ సిద్ధ‌మ‌య్యారు.

అయితే అల్ఫియా అదృశ్య‌మైంద‌ని వారు త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేయ‌డంతోనే.. ఆమెను అరెస్టు చేసి, కోర్టులో హాజ‌రుప‌రిచిన‌ట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ప్ర‌వ‌ర్త‌న‌పై ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు అఖిల్ తెలిపాడు.