10Th Exams | చంపుతాన‌ని బెదిరించి.. హిందీ ప్ర‌శ్న‌ప‌త్రం లాక్కున్నాడు..

Tenth Exams | తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు సంబంధించి తెలుగు, హిందీ ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీల ప‌ర్వం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను చంపుతాన‌ని బెదిరించి, హిందీ ప్ర‌శ్న‌ప‌త్రాన్ని ఓ బాలుడు బ‌ల‌వంతంగా లాక్కున్నాడ‌ని ఐదేండ్ల పాటు డిబార్ అయిన విద్యార్థి తెలిపాడు. ఇందులో తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని, డిబార్ చేయ‌డం అన్యాయ‌మ‌ని బాధిత విద్యార్థి బోరున విల‌పించాడు. హిందీ క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌ను నిందితుడికి అంద‌జేశాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హ‌నుమ‌కొండ క‌మ‌లాపూర్‌లోని […]

10Th Exams | చంపుతాన‌ని బెదిరించి.. హిందీ ప్ర‌శ్న‌ప‌త్రం లాక్కున్నాడు..

Tenth Exams |

తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు సంబంధించి తెలుగు, హిందీ ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీల ప‌ర్వం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను చంపుతాన‌ని బెదిరించి, హిందీ ప్ర‌శ్న‌ప‌త్రాన్ని ఓ బాలుడు బ‌ల‌వంతంగా లాక్కున్నాడ‌ని ఐదేండ్ల పాటు డిబార్ అయిన విద్యార్థి తెలిపాడు. ఇందులో తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని, డిబార్ చేయ‌డం అన్యాయ‌మ‌ని బాధిత విద్యార్థి బోరున విల‌పించాడు.

హిందీ క్వ‌శ్చ‌న్ పేప‌ర్‌ను నిందితుడికి అంద‌జేశాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హ‌నుమ‌కొండ క‌మ‌లాపూర్‌లోని మ‌హాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠ‌శాల విద్యార్థి.. గురువారం ప‌రీక్ష రాసేందుకు క‌మ‌లాపూర్ జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల వ‌ద్ద‌కు చేరుకున్నాడు.

అయితే అత‌న్ని ప‌రీక్ష రాసేందుకు హ‌నుమ‌కొండ డీఈవో అనుమ‌తించ‌లేదు. నీ మూలంగా ముగ్గురు ఉద్యోగులు స‌స్పెండ్ అయ్యార‌ని డీఈవో మంద‌లించారు. డిబార్ అయ్యావ‌ని, ప‌రీక్ష రాసేందుకు అనుమ‌తి లేద‌ని అత‌నికి చెప్పి పంపారు డీఈవో.

దీంతో తీవ్ర ఆవేద‌న‌కు గురైన బాధిత విద్యార్థి అక్క‌డున్న మీడియాతో మాట్లాడాడు. త‌న నెంబ‌ర్ ప‌రీక్షా కేంద్రంలోని మొద‌టి ఫ్లోర్‌లోని మూడో గ‌దిలో అలాట్ చేశారు. కిటికీ ప‌క్క‌నే త‌న నెంబ‌ర్ ఉండ‌డంతో అక్క‌డే కూర్చొని ప‌రీక్ష రాస్తున్నాను.

గోడ మీద నుంచి వ‌చ్చిన ఓ బాలుడు.. త‌న హిందీ పేప‌ర్‌ను లాక్కునే ప్ర‌య‌త్నం చేశాడు. తాను ఇవ్వ‌లేదు. క్వ‌శ్చ‌న్ పేప‌ర్ ఇవ్వ‌క‌పోతే చంపుతాన‌ని బెదిరించాడు. అత‌నే బ‌ల‌వంతంగా త‌న ప్ర‌శ్న‌ప‌త్రం లాక్కొని సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసుకుని వెళ్లిపోయాడు అని బాధిత విద్యార్థి వివ‌రించాడు.