Abbas | పవన్ కళ్యాణ్ గురించి భలే విషయం చెప్పాడు.. తెలిస్తే అబ్బాస్‌కి ఫ్యాన్ అయిపోవాల్సిందే!
Abbas | ఓ సినిమా హిట్ అయ్యి ప్రేక్షకుల్లోకి వెళ్లిపోగానే ఓవర్ నైట్ హీరోని, హీరోయిన్ని చేసేస్తారు. కానీ అదృష్టం బావుండి, వరుస విజయాలు అందుకుంటే సరే సరి.. లేదంటే ఫేయిడ్ అవుట్ అయిపోవడం అనేది సర్వసాధారణం. అందుకే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని నాలుగు కాలాలు నటించడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇక ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు.. అబ్బాయిలు అసూయ పడే అందాల నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అబ్బాస్‌కి సరైన అవకాశాలు […]

Abbas |
ఓ సినిమా హిట్ అయ్యి ప్రేక్షకుల్లోకి వెళ్లిపోగానే ఓవర్ నైట్ హీరోని, హీరోయిన్ని చేసేస్తారు. కానీ అదృష్టం బావుండి, వరుస విజయాలు అందుకుంటే సరే సరి.. లేదంటే ఫేయిడ్ అవుట్ అయిపోవడం అనేది సర్వసాధారణం. అందుకే సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని నాలుగు కాలాలు నటించడం అనేది అంత తేలికైన విషయం కాదు.
ఇక ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు.. అబ్బాయిలు అసూయ పడే అందాల నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అబ్బాస్‌కి సరైన అవకాశాలు వచ్చి ఉంటే ఇప్పటి హీరోలకు మళ్లే స్టార్ డమ్ అనుభవించాల్సిన హీరో. ఆయన తన కెరియర్‌లో ఎంత స్పీడ్‌గా దూసుకువచ్చాడో అంతే స్పీడ్‌తో తెరమరుగయ్యాడు. ఈమధ్య అబ్బాస్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆశ్చర్య పరిచే విషయం ఒకటి తెలిసింది. అదేంటంటే..
ఆ ఇద్దరు హీరోలూ దాదాపు ఒకేసారి సినిమాల్లోకి వచ్చారు. ఇద్దరి సినిమాలతోనూ యూత్‌ని ఓ ఊపు ఊపేశారు. హెయిర్ స్టైల్ నుంచి వాళ్ళ హావభావాల వరకూ ప్రతి కుర్రాడు ఫాలో అయ్యేవాడు. ఇక వాళ్ళ సినిమాలు విడుదలయ్యాయంటే ప్రేమలోకంలో విహరించని కుర్రాడే లేడంటే అతిశయోక్తి కాదేమో. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు.. అబ్బాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ఈ హీరోలిద్దరూ ఫ్రెండ్స్ అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అబ్బాస్ మధ్య మంచి స్నేహం ఉండేదట. పవన్ చెన్నై వెళ్లిన ప్రతిసారీ ఇద్దరూ కలిసేవారట. ఇద్దరం సినిమాల్లోకి రాకముందు నుండే స్నేహితులమని, పవన్ కళ్యాణ్ చెన్నై వచ్చిన చాలా సార్లు కలిశామని అబ్బాస్ తెలిపాడు. పవన్ సినిమాల్లో బిజీ అయిపోయాకా మళ్ళీ తనని కలవడం కుదరలేదని ఈ సంగతి అబ్బాస్ స్వయంగా తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, అలాగే అబ్బాస్ ‘ప్రేమదేశం’కి కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదు. ఈ సినిమాలు అప్పట్లో ఎంత క్రేజ్ తెచ్చి పెట్టాయంటే.. పవన్ కళ్యాణ్, అబ్బాస్ లాంటి హెయిర్ స్టైల్ కావాలని సెలూన్ షాపుల్లో డిమాండ్ చేసి మరీ అబ్బాయిలు అదే క్రాఫ్ చేయించుకునేవారు. ఈ ఇద్దర్నీ అప్పట్లో యూత్ తెగ ఫాలో అయ్యేవారు. ఆ తర్వాత పవన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ పవర్ స్టార్‌గా ఎదిగితే.. అబ్బాస్ మాత్రం సరైన సినిమా అవకాశాలు రాక కాస్త వెనకబడి మొత్తానికి సినిమాలనే వదిలేసి ఫారెన్ వెళ్ళి స్థిర పడిపోయాడు.
ఫారెన్‌లోనే ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీతో స్థిరపడిపోయాడు అబ్బాస్. ఇక అతని భార్య మాత్రం మూవీస్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ప్రస్తుతం అబ్బాస్ ఫారెన్ నుంచి చెన్నై రావడంతో యూట్యూబ్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్‌కి, తనకి ఉన్న స్నేహం గురించి బయటపెట్టాడు
. వాస్తవానికి సరైన హిట్స్ పడి ఉంటే మంచి స్థాయిలో ఉండాల్సిన అబ్బాస్.. అవి లేకే ఫేడవుట్ అయిపోయాడు. ఇప్పుడు మరోసారి కెరీర్ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో బుల్లితెరపై మొదలవబోతోన్న బిగ్‌బాస్ సీజన్ 7లో కూడా అబ్బాస్ పేరు వినబడుతోంది. చూద్దాం.. ఏం జరుగబోతోందో..?