అబార్షన్‌కు.. పెళ్లికి సంబంధం లేదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

విధాత‌, ఢిల్లీ: మహిళల గర్భస్రావాలపై సుప్రీంకోర్టు జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కీలక తీర్పును వెల్లడించింది. సురక్షితమైన, చట్టబద్దమైన అబార్షన్ ప్రక్రియకు మహిళలంతా అర్హులని సుప్రీంకోర్టు తెలిపింది. 1971 చ,ట్టం వివాహిత మహిళలకు సంబంధించిందన్నారు. అయితే 2021 చట్ట సవరణ వివాహితులు, అవివాహితుల మధ్య తేడా లేదన్నారు. ఈ విషయంలో వ్యత్యాసం చూపడం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆప్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారంగా రేప్ నిర్వచనంలో వైవాహిక అత్యాచారం […]

అబార్షన్‌కు.. పెళ్లికి సంబంధం లేదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

విధాత‌, ఢిల్లీ: మహిళల గర్భస్రావాలపై సుప్రీంకోర్టు జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం కీలక తీర్పును వెల్లడించింది. సురక్షితమైన, చట్టబద్దమైన అబార్షన్ ప్రక్రియకు మహిళలంతా అర్హులని సుప్రీంకోర్టు తెలిపింది.

1971 చ,ట్టం వివాహిత మహిళలకు సంబంధించిందన్నారు. అయితే 2021 చట్ట సవరణ వివాహితులు, అవివాహితుల మధ్య తేడా లేదన్నారు. ఈ విషయంలో వ్యత్యాసం చూపడం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మెడికల్ టెర్మినేషన్ ఆప్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారంగా రేప్ నిర్వచనంలో వైవాహిక అత్యాచారం కూడా ఉంటుందని కోర్టు తీర్పు వెల్లడించింది. చట్ట ప్రకారంగా సురక్షితమైన అబార్షన్‌ను మహిళలు చేయించు కోవచ్చని కోర్టు తెలిపింది. పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్ చేసుకోవచ్చని తెలిపింది.

ఒక మహిళ వైవాహిక స్థితి ఆమెకు అబార్షన్ హక్కును హరించడానికి కారణం కాకుడ‌ద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పెళ్లి కాని మహిళలు కూడా 24 వారాల్లో అవాంఛిత గర్భాన్ని కూడా రద్దు చేసుకొనేందుకు అర్హులని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

అవివాహిత మహిళలకు అవాంచిత గర్భాన్ని తొలగించుకొనే హక్కును తొలగించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎంటీపీ చట్టం ప్రకారం పెళ్లికాని మహిళ అబార్షన్ చేసుకోవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది.