రోడ్డుప్రమాదం.. నలుగురు ఫోటోగ్రాఫర్లు మృతి
మరొకరి పరిస్థితి విషమం భద్రాద్రి జిల్లా ఇల్లందులో ఘటన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళుతున్న ఫోటోగ్రాఫర్ వృత్తి నిర్వహిస్తున్న నలుగురు యువకులు దుర్మరణం పాలైన సంఘట శుక్రవారం రాత్రి ఇల్లందు మండలం కోటిలింగాల మలుపు వద్ద జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొక యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. […]

- మరొకరి పరిస్థితి విషమం
- భద్రాద్రి జిల్లా ఇల్లందులో ఘటన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళుతున్న ఫోటోగ్రాఫర్ వృత్తి నిర్వహిస్తున్న నలుగురు యువకులు దుర్మరణం పాలైన సంఘట శుక్రవారం రాత్రి ఇల్లందు మండలం కోటిలింగాల మలుపు వద్ద జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరొక యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన రాము (33), కళ్యాణ్ (34), శివకోటి(33), రణధీర్ (31) హనుమకొండ జిల్లా కమలాపురం చెందిన అరవింద్ (20) ఐదుగురు కలిసి కారులో ఫ్రీ వెడ్డింగ్ షూటు కోసం బూర్గంపాడు మండలం మోతే గ్రామానికి శుక్రవారం రాత్రి బయలు దేరారు.
ఇల్లందు మండలం కోటిలింగాల మూల మలుపు వద్ద కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా అరవింద్, రణధీర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అరవింద్ మృతి చెందారు.
నర్సంపేటకు చెందిన రణధీర్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదంలో నలుగురు యువకులు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది.