MLA Veeresham: ఎమ్మెల్యే వీరేశంకు న్యూడ్ కాల్ చేసిన నిందితుల అరెస్టు

MLA Veeresham: ఎమ్మెల్యే వీరేశంకు న్యూడ్ కాల్ చేసిన నిందితుల అరెస్టు

MLA Veeresham:  నల్లగొండ జిల్లా నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్స్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారం క్రితం వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేసి, ఆ తర్వాత వాట్సాప్ నెంబర్‌కు స్క్రీన్ రికార్డు పంపి నిందితులు డబ్బులు డిమాండ్ చేశారు.

ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలకు పంపారు. దీంతో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే వీరేశం ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో నిందితులను నకిరేకల్‌కు తీసుకొచ్చారు.