పొలిటిక‌ల్ లీడ‌ర్‌తో బాలీవుడ్ బ్యూటీ సీక్రెట్ పెళ్లి.. ఎవరంటే..?

Swara Bhasker | బాలీవుడ్ బ్యూటీ స్వ‌ర భాస్క‌ర్.. పొలిటిక‌ల్ లీడ‌ర్ ఫ‌హ‌ద్ జిరార్ అహ్మ‌ద్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. తాను వివాహం చేసుకున్న‌ట్లు స్వ‌ర భాస్క‌ర్ ఓ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. 2 నిమిషాల 5 సెక‌న్ల నిడివి గ‌ల వీడియోలో అహ్మ‌ద్‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం, పెళ్లి దాకా తీసుకొచ్చిన విష‌యాల‌న్నింటిని అందులో పొందుప‌రిచారు. ఇక త‌న భాగ‌స్వామి ఫ‌హ‌ద్ జిరార్ గురించి స్వ‌ర భాస్క‌ర్ ఇలా చెప్పుకొచ్చింది. కొన్ని సంద‌ర్భాల్లో మ‌న […]

పొలిటిక‌ల్ లీడ‌ర్‌తో బాలీవుడ్ బ్యూటీ సీక్రెట్ పెళ్లి.. ఎవరంటే..?

Swara Bhasker | బాలీవుడ్ బ్యూటీ స్వ‌ర భాస్క‌ర్.. పొలిటిక‌ల్ లీడ‌ర్ ఫ‌హ‌ద్ జిరార్ అహ్మ‌ద్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. తాను వివాహం చేసుకున్న‌ట్లు స్వ‌ర భాస్క‌ర్ ఓ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. 2 నిమిషాల 5 సెక‌న్ల నిడివి గ‌ల వీడియోలో అహ్మ‌ద్‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం, పెళ్లి దాకా తీసుకొచ్చిన విష‌యాల‌న్నింటిని అందులో పొందుప‌రిచారు.

ఇక త‌న భాగ‌స్వామి ఫ‌హ‌ద్ జిరార్ గురించి స్వ‌ర భాస్క‌ర్ ఇలా చెప్పుకొచ్చింది. కొన్ని సంద‌ర్భాల్లో మ‌న ప‌క్క‌నే ఉన్న దాని కోసం మ‌నం చాలా దూరం వెతుకుతాం.. మేమిద్ద‌రం ప్రేమ కోసం వెతికాం.. కానీ ప్రేమను వెతికినప్పుడు మొదట స్నేహం ఎదురవుతుంది. ఆ తర్వాతే అది ప్రేమతో పూర్తవుతుంది. ఈ ప్రయాణంలో ఒకరినొకరం తెలుసుకున్నాం. చివరగా నాకు ప్రేమ దొరికింది. వెల్ కమ్ టూ మై హార్ట్.. నా హృద‌యం కొంచెం గంద‌ర‌గోళంగా ఉంటుంది.. కానీ అది నీదే ఫహద్ అంటూ రాసుకొచ్చింది స్వ‌ర‌.

ఫ‌హ‌ద్ జిరార్, స్వ‌ర భాస్క‌ర్ జంట‌కు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. వీరి వివాహం కేవ‌లం కొద్ది మంది బంధువులు, స్నేహితుల మ‌ధ్య జ‌రిగింది. గ‌త నెల జ‌న‌వ‌రి 6వ తేదీన రిజిస్ట్ర్ మ్యారేజ్ చేసుకున్నారు.

2019 పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీలో చేప‌ట్టిన ఆందోళ‌న‌ల్లో స్వ‌ర భాస్క‌ర్ పాల్గొని తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేసింది. అదే వేదిక‌పై స‌మాజ్‌వాదీ పార్టీ నాయ‌కుడు ఫ‌హ‌ద్ జిరార్ అహ్మ‌ద్‌కు ఆమెకు ప‌రిచ‌యం అయ్యారు. ఇలా ఇద్ద‌రు క‌లిసి అనేక ర్యాలీలు, అనేక స‌మావేశాల్లో పాల్గొన్నారు. అలా వారి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది.