Ileana D’Cruz | అభిమానులకు షాక్‌ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా.. తల్లిని కాబోతున్నానంటూ పోస్ట్‌..!

Ileana D'Cruz | అభిమానులకు షాక్‌ న్యూస్‌ చెప్పింది గోవా బ్యూటీ ఇలియానా. తల్లిని కాబోతున్నట్లుగా ప్రకటించింది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పెళ్లి కాకుండానే ఇలియానా తల్లికాబోతుండడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విషయాన్ని ప్రకటించింది. పిల్లల టీ షర్ట్‌తో పాటు అలాగే తన మెడలో ‘మామా’ అని ఉన్న చైన్‌ను షేర్‌ చేసింది. ‘అండ్‌ సో ది అడ్వెంచర్‌ బిగిన్స్’ అని ఉన్న టీషర్ట్‌ను పోస్ట్‌ చేసింది. అలాగే ‘కమింగ్‌ సూన్‌.. నా చిన్నారి డార్లింగ్‌ని కలిసేందుకు […]

  • Publish Date - April 18, 2023 / 03:36 AM IST

Ileana D’Cruz | అభిమానులకు షాక్‌ న్యూస్‌ చెప్పింది గోవా బ్యూటీ ఇలియానా. తల్లిని కాబోతున్నట్లుగా ప్రకటించింది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పెళ్లి కాకుండానే ఇలియానా తల్లికాబోతుండడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విషయాన్ని ప్రకటించింది. పిల్లల టీ షర్ట్‌తో పాటు అలాగే తన మెడలో ‘మామా’ అని ఉన్న చైన్‌ను షేర్‌ చేసింది. ‘అండ్‌ సో ది అడ్వెంచర్‌ బిగిన్స్’ అని ఉన్న టీషర్ట్‌ను పోస్ట్‌ చేసింది. అలాగే ‘కమింగ్‌ సూన్‌.. నా చిన్నారి డార్లింగ్‌ని కలిసేందుకు ఆతృతతో ఉన్నాను’ ఉన్నానంటూ పోస్ట్‌ పెట్టింది. దాంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పెళ్లికాకుండానే ప్రెగ్రెన్సీ తల్లికావడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు పెళ్లి, ప్రేమ గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. ఒక్కసారిగా ప్రెగ్నెన్సీ అని ప్రకటించడం షాక్‌కు గురవుతున్నారు. పలువురు నెటిజన్లు ఇలియానాకు శుభాకాంక్షలు తెలుపుతుండగా.. మరికొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకున్నావ్‌..? పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు..? తండ్రి పేరు చెప్పవా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలియానా పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలోనే కాదు బాలీవుడ్‌, టాలీవుడ్‌లోనూ సంచలనంగా మారింది. నిజంగానే తల్లికాబోతుందా..? లేదంటే ఏదైనా సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇలా చేస్తుందా? అని పలువురు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

అయితే రీసెంట్‌గా బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్ బ్రదర్‌తో రిలేషన్ షిప్‌లో ఉందని ప్రచారం జరిగింది. ఇలియానా రామ్‌పోతినేని ‘దేవదాస్‌’ చిత్రంలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నాజూకు నడుము అందాలతో టాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా కొనసాగింది. పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, రవితేజ తదితర స్టార్‌ హీరోలతో నటించింది. ఇటీవల తెలుగులో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్‌కు షిఫ్ట్‌ అయ్యింది. అక్కడ కూడా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటో షూట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నది. ఇలియానా చివరిసారిగా ‘సాబ్‌ గజబ్‌’ వీడియో సాంగ్‌లో కనిపించింది. బాద్షా రూపొందించిన ర్యాప్‌ పాప్‌ సాంగ్‌లో మెరిసింది. ఒకప్పుడు సన్నజాజి తీగలా ఉన్న ఇలియానా.. ఈ సాంగ్‌లో బొద్దుగా ఉండడంతో అందరికీ షాక్‌కు గురయ్యారు.

Latest News