Adilabad | బాసర ట్రిపుల్ ఐటీలో PUC ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య
Adilabad అంతర్గత విచారణకు ఆదేశించిన వీసీ విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ లో పియుసి ప్రథమ సంవత్సరం చదువుతున్న దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్ లో మధ్యాహ్నం టాయిలెట్ కి వెళ్ళిన విద్యార్థిని ఎంతకు బయటికి రాకపోవడంతో భద్రతా సిబ్బంది తలుపులు పగలగొట్టి చూసే సరికి బాత్రూంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే బాసర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరిశీలించి మృతి చెందిందని […]

Adilabad
- అంతర్గత విచారణకు ఆదేశించిన వీసీ
విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ లో పియుసి ప్రథమ సంవత్సరం చదువుతున్న దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్ లో మధ్యాహ్నం టాయిలెట్ కి వెళ్ళిన విద్యార్థిని ఎంతకు బయటికి రాకపోవడంతో భద్రతా సిబ్బంది తలుపులు పగలగొట్టి చూసే సరికి బాత్రూంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
వెంటనే బాసర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరిశీలించి మృతి చెందిందని తెలిపారు . ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వెంకటరమణ అంతర్గత విచారణకు ఆదేశిస్తూ నలుగురు సభ్యులతో కమిటీని నియమించారు.
ఈ కమిటీలో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్, అసోసియేట్ డీన్, సైన్సెస్, చీఫ్ వార్డెన్, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ త్వరితగతిన విచారణ జరిపి నివేదికను అందజేయాలని, దీంతోపాటు పరీక్షల నిర్వహణపై డిన్స్ తో కమిటీ వేసి తుది నివేదికను అందజేయాలని వైస్ ఛాన్స్ లర్ ఆదేశించారు.