Adilabad | తిమ్మాపూర్ చెరువుకు గండి.. దెబ్బతిన్న పంటలు

Adilabad | విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామ చెరువుకు గండిపడింది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తిమ్మాపూర్ చెరువు నిండుకుండలా మారింది. చెరువు కిందికి ఆయకట్టు రైతులు, మత్స్యకారులు సంతోషంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా నిన్న రాత్రి తిమ్మాపూర్ చెరువుకు భారీ గండిపడి చెరువులో ఉన్న నీరంతా పక్కనే ఉన్న పంటపొలాల నుంచి ప్రధాన రహదారి పైకి ప్రవహించి పెద్ద మొత్తంలో సొయా, […]

  • By: krs    latest    Jul 26, 2023 10:08 AM IST
Adilabad | తిమ్మాపూర్ చెరువుకు గండి.. దెబ్బతిన్న పంటలు

Adilabad |

విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామ చెరువుకు గండిపడింది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తిమ్మాపూర్ చెరువు నిండుకుండలా మారింది. చెరువు కిందికి ఆయకట్టు రైతులు, మత్స్యకారులు సంతోషంలో మునిగిపోయారు.

ఇదిలా ఉండగా నిన్న రాత్రి తిమ్మాపూర్ చెరువుకు భారీ గండిపడి చెరువులో ఉన్న నీరంతా పక్కనే ఉన్న పంటపొలాల నుంచి ప్రధాన రహదారి పైకి ప్రవహించి పెద్ద మొత్తంలో సొయా, పత్తి పంటలు దెబ్బ తినడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

గత సంవత్సరం ఇదే వర్షాకాలంలో చెరువుకు గండి పడడంతో గ్రామానికి చెందిన ఓ రైతు తన సొంత ఖర్చుతో గండిని పూడిపించాడు. స్థానిక రైతులు చెరువు కట్టను ఆధునికరించాలని మళ్లీ గండి పడే అవకాశాలున్నాయని అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదు.

సంవత్సర కాలం నుండి రైతన్నలు అధికారులకు, పాలకులకు విన్నవించినా చెరువు వంక చూడడం లేదని, పట్టించుకున్న పాపాన పోలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి చెరువుకు మరమ్మతులు చేయించి, దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇప్పించి తమను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.