Adipurush | ‘ఆదిపురుష్’ టీమ్‌కి చెమటలు పట్టించిన ఫేక్ రాయళ్లు

Adipurush | ఫేక్ కరెన్సీని అరికట్టేందుకు ప్రభుత్వం డీమానిటైజేషన్ ప్రక్రియ చేపట్టి.. కొత్త నోట్లను అందుబాటులోకి వస్తే.. అవి వచ్చిన కొన్ని రోజుల్లోనే మళ్లీ ఫేక్ కరెన్సీ హల్‌చల్ చేసింది. అంత ఫాస్ట్‌గా టెక్నాలజీని మిస్ యూజ్ చేయడానికి వాడుతున్నారు. ఇప్పుడీ ఫేక్ విషయంలో ‘ఆదిపురుష్’ టీమ్‌కి దాదాపు చెమటలు పట్టించారు ఫేక్ రాయుళ్లు. అదెలా అనుకుంటున్నారా? మరదే మ్యాటర్ ఇక్కడ. రెండు రోజుల క్రితం ‘ఆదిపురుష్’ ప్రదర్శించబడే థియేటర్లలో హనుమంతుడి కోసం ఓ సీట్‌ను ఎంఫ్టీగా […]

  • By: krs    latest    Jun 08, 2023 3:30 AM IST
Adipurush | ‘ఆదిపురుష్’ టీమ్‌కి చెమటలు పట్టించిన ఫేక్ రాయళ్లు

Adipurush |

ఫేక్ కరెన్సీని అరికట్టేందుకు ప్రభుత్వం డీమానిటైజేషన్ ప్రక్రియ చేపట్టి.. కొత్త నోట్లను అందుబాటులోకి వస్తే.. అవి వచ్చిన కొన్ని రోజుల్లోనే మళ్లీ ఫేక్ కరెన్సీ హల్‌చల్ చేసింది. అంత ఫాస్ట్‌గా టెక్నాలజీని మిస్ యూజ్ చేయడానికి వాడుతున్నారు. ఇప్పుడీ ఫేక్ విషయంలో ‘ఆదిపురుష్’ టీమ్‌కి దాదాపు చెమటలు పట్టించారు ఫేక్ రాయుళ్లు. అదెలా అనుకుంటున్నారా? మరదే మ్యాటర్ ఇక్కడ.

రెండు రోజుల క్రితం ‘ఆదిపురుష్’ ప్రదర్శించబడే థియేటర్లలో హనుమంతుడి కోసం ఓ సీట్‌ను ఎంఫ్టీగా ఉంచుతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ పోస్టర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడు ఉన్నచోట హనుమంతుడు తప్పక ఉంటాడని, అందుకే ‘ఆదిపురుష్’ థియేటర్లలో హనుమంతుడి కోసం ఓ సీటు ఖాళీగా ఉంచుతున్నామని, అందరూ రామభక్తుడైన హనుమంతుడి సమక్షంలో ఈ సినిమాని వీక్షించండి అంటూ సెంటిమెంట్‌తో కొట్టారు.

ఆ సెంటిమెంట్‌కి ఆయింట్‌మెంట్ పూసి.. చెమటలు పట్టించారు ఫేక్ మొనగాళ్ళు. అర్థం కాలేదు కదా.. మేకర్స్ హనుమంతుడి కోసం సీట్ అంటూ ఏ పోస్టర్ అయితే విడుదల చేశారో.. అదే పోస్టర్‌పై ‘దళితులకు థియేటర్లలోకి ప్రవేశం లేదు’ అంటూ ‘ఆదిపురుష్’ అధికారిక పోస్టర్ మాదిరిగానే ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

అందులో.. ‘‘రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ.. ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో ధర్మం కోసం నిర్మించిన ‘ఆదిపురుష్’ని హిందువులందరూ తప్పక వీక్షిద్దాం’’ అని ఫేక్ రాయుళ్లు ఆ పోస్టర్‌లో రాసి వదిలారు.

ఈ పోస్టర్ చూసి ఒక్కసారిగా మేకర్స్ షాక్‌కి గురయ్యారు. వెంటనే అప్రమత్తం అవుతూ.. ఆ పోస్టర్, అందులోని మ్యాటర్ నిజం కాదని అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా భారతీయులందరిది. కుల, వర్ణ లేదా మతం అనే ఎలాంటి వివక్షకు ఇందులో తావులేదు. ఈ సినిమాని సమానత్వాన్ని కోరుతూ తెరకెక్కించాం. దయచేసి సోషల్ మాధ్యమాలలో తప్పుదారి పట్టిస్తున్న ఆ ఫేక్ పోస్టర్‌ని ఎవరూ నమ్మవద్దు.. అంటూ యూనిట్ వివరణ ఇచ్చారు.