Agri Legal Aid Clinics |
విధాత: రైతులకు భూమి, వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించడానికి లీఫ్ సంస్థ ప్రతి గ్రామంలో అగ్రీ లిగల్ ఎయిడ్ క్లనిక్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రైతులకు భూమి, వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగించడానికి ఆదివారం బొమ్మెర గ్రామంతో పాటు వరంగల్ పట్టణంలో రైతు చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది.
దేశంలోనే మొదటి సారి న్యాయస్థానం ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు లీఫ్ సంస్థ అధ్యక్షులు, భూమి, వ్యవసాయ చట్టాల నిపుణులు భూమి సునీల్ తెలిపారు. ఈ సదస్సులకు ముఖ్య అతిధిగా హై కోర్టు న్యాయమూర్తి పి. నవీన్‌రావు హాజరవుతున్నారన్నారు.
ఉదయం 9 గంటలకు బొమ్మెర గ్రామంలో, మధ్యాహ్నం 12 గంటలకు వరంగల్ కోర్టు ప్రాంగణంలో రైతు చట్టాలపై అవగాహన సదస్సులను లీఫ్ సంస్థ, నల్సార్ న్యాయ విశ్వవిధ్యాలయం, రాష్ట్ర న్యాయ సేవా సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నామన్నారు.
దేశంలో ఏడు లక్షల గ్రామాలున్నాయని, ఈగ్రామాలలో న్యాయ సేవా అథారిటీలు, వ్యవసాయశాఖలు, స్వచ్ఛంద సంస్థలు కానీ ఇలాంటి సదస్సులు నిర్వహిస్తే రైతులకు చట్టం గురించి తెలుస్తుందన్నారు. రైతులకు భూమి, వ్యవసాయ చట్టాలపై అవగాహన కలిగితే వారికి కష్టాలు, నష్టాలు తీరుతాయని సునీల్ అన్నారు.